ఇండియా కరోనా అప్డేట్..కొత్తగా ఎన్ని కేసులు నమోదయ్యాయంటే?

0
108

భారత్ లో కరోనా మహమ్మారి సృష్టించిన కల్లోలం అంతాఇంతా కాదు. ఈ మహమ్మారి దెబ్బకు వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇప్పటికే మూడు వేవ్ లుగా వచ్చిన ఈ మహమ్మారి ఎంతోమందిని పొట్టనబెట్టుకున్నాయి. ఇక కరోనా పీడ విరగడైంది అనుకునే తరుణంలో కొత్త కేసుల సంఖ్య పెరగడం ప్రజలను ఆందోనళకు గురి చేస్తుంది.

ఇక తాజాగా కేంద్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం..గడిచిన 24 గంటల్లో..4,129 కొత్త కేసులు నమోదు అయ్యాయి. ఈ మహమ్మారి కారణంగా మరొ 20 మంది మరణించారు. ఇక  యాక్టివ్ కేసులు 0.10 శాతంగా ఉంది.

మొత్తం కేసులు: 4,45,72,243

మరణాలు: 5,28,530

యాక్టివ్ కేసులు: 43,415

రికవరీలు: 4,40,00,298