ఇండియా కరోనా అప్డేట్..పెరిగిన మరణాలు

0
88

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి కల్లోలం సృష్టించిన సంగతి తెలిసిందే. భారత్ లో ఇప్పటికే మూడు వేవ్ లుగా వచ్చిన ఈ మహమ్మారి ఎందరినో పొట్టన బెట్టుకుంది. ఇక కరోనా పోయిందనుకునే సమయానికి కేసుల సంఖ్య పెరుగుతుండడం ఇప్పుడు అందరిని కలచివేసింది. దీనితో ఫోర్త్ వేవ్ రానుందనే భయం అందరిలోనూ నెలకొంది.

తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 11,793 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,34,18,839 కు చేరింది. అలాగే యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 96,700 కు చేరింది.

కరోనా పాజిటివిటి రేటు 96.18 శాతంగా ఉంది. తాజాగా దేశంలో 27 మంది కరోనాతో మరణించగా మృతుల సంఖ్య 5,25,047 కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 9486 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 1,97,31,43,196 మందికి కరోనా వ్యాక్సిన్లు పంపిణీ చేశారు.