ఇండియా కరోనా అప్డేట్..కొత్తగా 15,815 కరోనా కేసులు..మరణాలు ఎన్నంటే?

0
118

ఇండియాలో కరోనా మహమ్మారి ఎంతటి కల్లోలం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ మహమ్మారి కొత్త వేరియంట్లుగా పుట్టుకొచ్చి పెను నష్టాన్ని మిగిల్చింది. ఇప్పటికి మూడు వేవ్ లుగా వచ్చిన ఈ మహమ్మారి ఎందరినో పొట్టనబెట్టుకుంది. కాస్త ఇప్పుడిప్పుడే కేసులు తగ్గుముఖం పడుతున్నాయనుకుంటున్న క్రమంలో మళ్ళి తాజా కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది.

ఇక తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం..గడిచిన 24 గంటల్లో దేశంలో 15,815 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,42, 53897కు చేరింది. ఇక దేశంలో యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 1,19,264 కు చేరింది. దేశంలో తాజాగా 53 మంది కరోనాతో మరణించ గా మృతుల సంఖ్య 526996కి చేరింది.

ఇక కరోనా పాజిటివిటి రేటు విషయానికొస్తే 98.48 శాతంగా ఉంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 20,018 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక దేశవ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 4,35, 93112 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 2.077 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్లు చేసినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.