ఇండియా కరోనా అప్డేట్..తాజా కేసులు ఎన్నంటే?

0
111
RT-PCR mandatory

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి కల్లోలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే మూడు వేవ్ లుగా వచ్చిన మహమ్మారి ఎందరినో పొట్టన బెట్టుకుంది. ఇక కరోనా పోయిందనుకునే సమయానికి కేసుల సంఖ్య పెరుగుతుండడం ఇప్పుడు అందరిని కలచివేసింది. దీనితో ఫోర్త్ వేవ్ రానుందనే భయం అందరిలోనూ నెలకొంది.

ఫ్రాన్స్ లో కొద్ది రోజులుగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. అలాగే మన దేశంలో కూడా కరోనా కొత్త కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం 24 గంటల్లో 485 కరోనా కేసులు నమోదయ్యాయి. తెలంగాణా రాష్ట్రంలో యాక్టివ్ కరోనా కేసులు 11,574 గా ఉన్నాయి. ఇక మరణాల విషయానికొస్తే  గడిచిన 24 గంటల్లో కరోనాతో 30 మంది మృతిచెందారు. రాష్ట్రంలో మొత్తం కరోనా పరీక్షలు సంఖ్య 3,55,58,922 కు చేరుకుంది.

మొత్తం కరోనా కేసులు: 8,00,476

యాక్టివ్​ కేసులు: 11,574

రికవరీ రేటు: 97.84