భార‌త్ ప్రపంచ రికార్డు..2 కోట్ల మందికి వ్యాక్సినేషన్

0
91

క‌రోనా వైర‌స్‌ను నియంత్రించ‌డానికి ఉన్న ఒకే ఒక్క ఆయుధం వ్యాక్సిన్. ఈ మేరకు దేశ వ్యాప్తంగా ఉచితంగా క‌రోనా వ్యాక్సిన్లు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. కాగ ఈ ఏడాది జ‌న‌వ‌రి 3వ తేదీ నుంచి దేశ వ్యాప్తంగా 15 నుంచి 18 ఏళ్ల వ‌య‌సు ఉన్న పిల్ల‌ల‌కు కూడా క‌రోనా వ్యాక్సిన్  పంపిణీ చేస్తున్నారు.

కాగా తాజాగా మ‌న దేశం 15 నుంచి 18 ఏళ్ల వ‌య‌స్సు ఉన్న వారికి వ్యాక్సిన్ పంపిణీ చేయ‌డంలో ప్ర‌పంచ రికార్డును సృష్టించింది. ప్రపంచంలోనే ఎక్కువ‌ 15-18 ఏళ్ల వ‌య‌స్సు ఉన్న పిల్ల‌ల‌కు వ్యాక్సిన్ అందించిన దేశంగా భార‌త్ రికార్డు సృష్టించింది. నేటి వ‌ర‌కు 2 కోట్ల మంది 15 నుంచి 18 ఏళ్ల వ‌య‌సు ఉన్న పిల్ల‌ల‌కు క‌రోనా వ్యాక్సిన్ ల‌ను కేంద్ర ప్ర‌భుత్వం పంపిణీ చేసింది.

ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మ‌న్సుఖ్ మాండివీయా త‌న అధికారిక ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా ప్ర‌క‌టించారు. కాగ 15 నుంచి 18 ఏళ్ల వ‌య‌స్సు ఉన్న పిల్ల‌లు దేశ వ్యాప్తంగా వ్యాక్సిన్లు తీసుకోవ‌డానికి స్వ‌చ్ఛందంగా ముందుకు వ‌స్తున్నారు. దీంతో భారీ సంఖ్య‌లో వ్యాక్సిన్లను పంపిణీ చేశామన్నారు.