ప్రస్తుతం చాలామంది ఎదుర్కొంటున్న సమస్యలలో చికెన్ గున్యా కూడా ఒకటి. ఒక్కసారి ఈ వ్యాధి సోకిందంటే ఆ వ్యక్తి నరకాన్ని అనుభవిస్తూ లోకంలో జీవించాల్సిందే. మరి ఇలాంటి వ్యాధి నుండి ఉపశమనం పొందలేమా అంటే ఖచ్చితంగా పొందొచ్చు అంటున్నారు నిపుణులు. మనం ప్రస్తుతం చికున్‌గున్యా ఎలా వస్తుంది? లక్షణాలేంటి? ఎలా నివారించాలో తెలుసుకుందాం..?
చికున్‌గున్యా వ్యాధి ఫ్లావీ వైరస్ కారణంగా వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఎడిస్ ఈజిప్టి అనే దోమ కాటు వల్ల ఈ వ్యాధి సక్రమించి తీవ్రమైన బాధకు లోనుచేస్తుంది. దోమ కుట్టిన 3-7 రోజుల మధ్య ఈ వ్యాధి లక్షణాలు బయటపడతాయి.
చికున్‌గున్యా లక్షణాలు..
వైరస్ సోకిన మొదటి రోజుల్లో తీవ్రమైన తలనొప్పి ఉంటుంది. అంతేకాకుండా కాళ్లు, చేతుల కీళ్లు నొప్పిగా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో కీళ్లలో వాపు కూడాదారితీసే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
నివారణ..
చికున్‌గున్యా సోకిన వారు ఎక్కువ మొత్తంలో ఫ్లూయిడ్స్ తీసుకోవాలి. అలాగే వేడి వేడి ఆహారాలను తినడంతో పాటు పండ్లు కూడా ఎక్కువగా తినాలి. కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందేందుకు లవంగాల నూనె, వెల్లుల్లి పేస్ట్‌ను కీళ్లపై మర్ధన చేయాలి.