జున్ను తింటే మంచిదా చెడా ? ఎక్కువ తింటే దీని వల్ల ఏమవుతుంది?

-

జున్ను అంటే ఎవరికి అయినా ఇష్టమే, వీటిలో బెల్లం మిరియాలు వేసి కలిపితే వాటిని మురిపాలు అని అంటారు, అంత రుచిగా ఉంటాయి, అయితే పాడి ఉన్న వారికి జున్నుకు కొదవ ఉండదు, పాడి లేకపోతే బయట కొనుక్కోవాలి, అయితే ఇప్పుడు జున్ను పౌడర్ కూడా వచ్చేసింది, కాని పాడి నుంచి వచ్చిన పాల టేస్ట్ దేనికి రాదు.

- Advertisement -

అయితే జున్ను తింటే మంచిదే, ఇందులో పోషకాలు చాలా ఉన్నాయి, సన్నగా ఉన్నవారు జున్ను తింటే లావవుతారు, జున్నులో ప్రొటీన్స్ భారీగా ఉంటాయి, ఇవి శరీరానికి శక్తిని ఇస్తాయి..ఇక
జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది. జున్నులో విటమిన్-డి పుష్కలంగా ఉంటుంది. ఇది తింటే మనిషి పుష్కలంగా ఉంటారు.

జున్నులో క్యాల్షియం సమృద్ధిగా ఉంటుంది. ఇది ఎముకలు, దంతాల బలానికి ఎంతో దోహదపడుతుంది.
గర్భిణి స్త్రీలు ప్రతిరోజూ రెండుపూటలా జున్నులో కొద్దిగా చక్కెర లేదా తేనె కలిపి తీసుకుంటే శిశువు ఆరోగ్యానికి ఎంతో సహాయపడుతుంది. ఇక మలబద్దక సమస్య ఉన్నా తగ్గుతుంది..జున్ను తినడం ద్వారా మీ జీర్ణవ్యవస్థ కూడా చాలా బాగుంటుంది.

నోట్ – గర్భిణి స్త్రీలు కచ్చితంగా డాక్టర్ ని అడిగి వారికి ఎలాంటి ఇబ్బంది లేదు అంటేనే తినాలి అని చెబుతున్నారు నిపుణులు… లేదంటే వాతం చేస్తుంది అంటున్నారు డాక్టర్లు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...