చాక్లెట్స్ తింటే లాభమా – నష్టమా ?

Is it a benefit or a loss to eat chocolates?

0
128

చాక్లెట్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ముఖ్యంగా యూత్ ఎంతో ఇష్టంగా తింటారు. మన మూడ్ బట్టీ చాక్లెట్ అనేది ఎక్కువగా తింటూ ఉంటాం. చాక్లెట్స్ అతిగా తింటే లావుగా అవుతారని అంటుంటారు. అయితే చాక్లెట్స్ బరువు పెరగడంలో కాదు, తగ్గించడానికి సహయపడుతుందని తాజా అధ్యయానాల్లో తేలింది. అయితే షుగర్ సమస్య ఉన్న వారు చాక్లెట్స్ తినకపోవడం బెటర్. ఇక మహిళలకు నెలసరి సమస్యలు డార్క్ చాక్లెట్స్ తీసుకోవడం వల్ల తగ్గుతాయి. అది మితంగా తీసుకోవచ్చు.

వైట్ చాక్లెట్స్ ఎక్కువగా తినడం వలన బరువు తగ్గడమే కాకుండా ఆకలి వేస్తుంది. ఊబకాయ సమస్యలు తగ్గుతాయి.
ఉదయం చాక్లెట్స్ ఎక్కువగా తింటే కొవ్వును బర్న్ చేయడమే కాకుండా రక్తంలో గ్లూకోజ్ స్థాయిని తగ్గిస్తుందని పరిశోధనల్లో తేలింది. ఇక 10 ఏళ్ల పిల్లలకు ఇవి ఇవ్వడం వల్ల పళ్ల సమస్యలు అధికంగా వస్తాయి. అందుకే చాక్లెట్స్ తింటే కచ్చితంగా పిల్లలకి నోరు శుభ్రం చేయాలి.

సాయంత్రం 6 లోపు, అలాగే ఉదయం 10 తర్వాత చాక్లెట్స్ తీసుకుంటే మంచిది. ఒకటి గుర్తించాలి చాక్లెట్స్ అధికంగా తినడం వలన కేలరీలు పెరిగాయి కానీ బరువు పెరగలేదు అని యూఎస్ అధ్యయనంలో తేలింది.