పల్లికాయ.. వేరుశనగ- మట్టి శనగ ఇలా ఒక్కో పేరుని ఒక్కో ప్రాంతంలో పిలుస్తారు… ఎక్కడ ఎవరు ఎలా పిలిచినా అవి మాత్రం ఒకటే.. అయితే ఇవి చాలా మంది ఉడకబెట్టి తీసుకుంటారు.. కొందరు వేపుకుని తింటారు.. మరికొందరు పల్లీ చెక్క రూపంలో బెల్లంతో తీసుకుంటారు.
ఇందులో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది అనే భయంతో చాలా మంది వీటిని తినరు, ఇక లావు అవుతాము అనే భయం చాలా మందిని వీటికి దూరం చేస్తుంది.. వీటిని ఉడకబెట్టి వేయించుకుని, పచ్చడి, కూరలు చేసుకుని తినొచ్చు. అయితే మితంగా తింటే ఎలాంటి ఇబ్బంది ఉండదు.. మీకు ఆలోచన శక్తి పెరుగుతుంది..
మీ మైండ్ చురుగ్గా పని చేస్తుంది…ఇందులో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి.ప్రతిరోజూ 30 గ్రాముల పల్లీలు తీసుకుంటే గుండె సంబంధిత వ్యాధులు రావని నిపుణులు చెబుతున్నారు…పల్లీలు శరీరంలో రోగ నిరోధకశక్తిని పెంచడంలో కూడా ముఖ్య పాత్ర పోషిస్తాయి. గర్భిణులు నిత్యం పల్లీలు తీసుకుంటే అవసరమైన పోషకాలు అందుతాయి. విటమిన్ ఇ, విటమిన్ బి పుష్కలంగా ఉంటుంది. ఇక వేపినవి కాకుండా ఉడికించినవి తింటే పీచు పదార్దం ఉంటుంది.. ఇవి ఇంకా మంచిది.. అయితే రెండు రోజులకి ఓసారి తీసుకున్నా మంచి పోషకాలు అందుతాయి.