ముఖం జిడ్డుగా మారుతోందా..ఇలా చేయండి

Is the face becoming greasy? Do this

0
82

చక్కగా తయారయ్యి బయటకు వెళ్తారు. కానీ, అరగంటకే ముఖమంతా నూనె పేరుకుపోయినట్లు అనిపిస్తుంది. ఎన్నిసార్లు ముఖం కడిగినా మళ్లీ వెంటనే జిడ్డుగానే ఉంటుంది. ఈ తరహా సమస్య చాలా మందికి ఎదురవుతుంటుంది. మరి దీన్ని తగ్గించుకోవడమెలా..ముఖం అందంగా మెరిసిపోవాలని అందరికీ ఉంటుంది. కానీ, కొంతమందికి జిడ్డు సమస్య చాలా ఇబ్బంది కలిగిస్తుంది. అయితే ఈ సమస్యను తగ్గించుకునేదెలా? దీనికి వైద్య నిపుణులు ఎలాంటి పరిష్కారాలు చూపిస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

సాధారణంగా..ఆయిలీ స్కిన్, డ్రై స్కిన్, కాంబినేషన్ స్కిన్ అని మూడు రకాల చర్మాలు ఉంటాయి. హార్మోన్ ప్రభావం వల్ల కొందరిలో ఆయిల్ ఉత్పత్తిచేసే గ్రంథులు ఎక్కువగా ఉద్దీపన చెందుతాయి. ఫలితంగా ముఖంపై జిడ్డు పేరుకుపోతుంది.

ఈ సమస్యను ఎదుర్కోవడానికి క్రీములను ఉపయోగించవచ్చు. ట్రెటినాయిన్ బేస్ క్రీమ్స్, అసలైన్ బేస్ క్రీమ్స్​ వంటివి వాడితే జిడ్డు సమస్య తగ్గిపోతుంది. ఆయిలీ స్కిన్​వారి కోసం ప్రత్యేక​ ఫేస్​వాష్​లు, ట్యాబ్లెట్లు ఉంటాయి. వైద్యుల సలహాతో వీటిని వినియోగించి జిడ్డు సమస్యను తొలగించుకోవచ్చు. కెమికల్ పీలింగ్​, లేజర్ టోనింగ్​, కార్బన్ పీలింగ్ అనే వైద్య చికిత్సలు కూడా ఉంటాయి. సమస్య తీవ్రతను బట్టి వైద్యులు ఎవరికి కావాల్సిన చికిత్సను వారికి అందిస్తారు.

కొంత మంది ఆయిలీ స్కిన్​ ఉందని రోజులో ఎక్కువసార్లు కడుగుతూ ఉంటారు. అలా చేయడం వల్ల ఆయిల్​ మరింత ఎక్కువగా ఉత్పత్తయ్యే ప్రమాదం ఉంది. ఆయిలీ ఫేస్ ఉన్నప్పిటకీ రోజుకు మూడు, నాలుగు సార్లు మాత్రమే కడగాలి. మరికొంత మంది ముఖంపై ఆయిల్​ను తొలగించుకోవడానిరకి కర్చీప్, టిష్యూ పేపర్లు వంటి వాటితో పదేపదే రుద్దుతూ ఉంటారు. ఫలితంగా నుదురు, ముఖంపై బ్లాక్ మార్క్స్ వంటివి ఏర్పడే ప్రమాదం ఉంది. అందుకని తరుచూ అలా చేయకపోవడమే మంచిది.