బట్టతల సమస్య వేధిస్తోందా?

0
114

సాధారణంగా మగవారిని వేధించే ప్రధాన సమస్యలలో ఒకటి బట్టతల. ఇటీవల ఈ సమస్య అందరిలో సాధారణమైపోయింది. జుట్టు రాలడం అనేక కారణాల వల్ల జరుగుతుంది. బట్టతల రావడంతో అందవిహీనంగా కనపడడంతో బయటకు రావడానికి నలుగురిలో కలవడానికి ఆలోచిస్తుంటారు. ఒకప్పుడైతే బట్టతల సమస్యకు విగ్ పెట్టుకోవడం మినహా.. ఇంకేం పరిష్కారం ఉండేది కాదు. కానీ ఇప్పుడు వచ్చిన హెయిర్ ట్రాన్స్​ప్లాంటేషన్.. బట్టతల ఉన్నవారికి ఓ వరంలా మారింది.

అయితే, ఒక్కసారి బట్టతల వచ్చిందంటే.. ట్రాన్స్​ప్లాంటేషన్ మినహా ఇంకే ఇతర ఆలోచనలు పెట్టుకోవద్దని నిపుణులు చెబుతున్నారు. సాధారణ పద్ధతుల్లో బట్టతలపై వెంట్రుకలు రావడం దాదాపు అసాధ్యమని చెబుతున్నారు. మందులు, పీఆర్​పీ వంటి వాటి వల్ల వెంట్రుకలు వస్తాయని అనుకోవడం అపోహేనని అంటున్నారు.

బట్టతల రావడానికి ప్రధాన కారణం అధిక ఒత్తిడి, వైద్య పరిస్థితి, మందులు తీసుకోవడం లేదా పోషకాల కొరత కారణం అని వైద్యులు చెబుతున్నారు. దీనిని అరికట్టాలంటే పురుషులు తమ జుట్టు పట్ల శ్రద్ధ వహించాలంటున్నారు. జుట్టు దువ్వేటప్పుడు గట్టిగా లాగుతూ దువ్వకూడదట. జుట్టుకు వేడి నూనెను కూడా రాయకూడదంటున్నారు. ఎందుకంటే మీ జుట్టు రాలడం మొదలవడానికి ఇదే ప్రధాన కారణం అంటున్నారు. రబ్బరు బ్యాండ్‌లు, బారెట్‌లు, బ్రెయిడ్‌లను ఉపయోగిస్తే జుట్టుకు ఒత్తిడి పెరిగి రాలిపోతుందట.. కాబట్టి వాటిని దూరంగా ఉంటే మంచిదంటున్నారు.