ఒమిక్రాన్ కేసులకు బూస్టర్ డోసులతో చెక్ పెట్టొచ్చా?

Is there a check with booster doses for omicron cases?

0
85

కరోనా, ఒమిక్రాన్ వేరియంట్, డెల్టా వేరియంట్ కంటే ప్రమాదకరమైందా..అసలు ఒమిక్రాన్ అనేది ఎలా వ్యాప్తి చెందుతుంది. ఒమిక్రాన్ పై వాక్సిన్ల ప్రభావం ఎలా వుంటుంది. ఒమిక్రాన్ ను అరికట్టాలంటే బూస్టర్ డోస్ లు అవసరం అవుతాయా అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఒమిక్రాన్ వేరియంట్ ప్రస్తుతం భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా 38 దేశాలకు పాకింది. దీంతో కరోనా వైరస్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నామనే సంతోషం కాస్తా ఆవిరై..మళ్లీ ఏం జరగనుందా అనే భయాందోళన జనాన్ని వెంటాడుతోంది.  కొవిడ్-19 బూస్టర్ డోస్ తీసుకుంటే ఒమిక్రాన్ వేరియంట్‌కి చెక్ పెట్టవచ్చా అని. కరోనా థర్డ్ వేవ్ తప్పదేమో అనే వార్తలు తెరపైకొచ్చినప్పుడే ఈ బూస్టర్ డోస్ షాట్ కూడా ప్రచారంలోకొచ్చింది. ఒమైక్రాన్ రాకతో మరోసారి బూస్టర్ షాట్ వార్తలకు ప్రాధాన్యత చేకూరింది.

కొత్తగా వస్తున్న వేరియంట్స్‌ని ఓడించాలంటే బూస్టర్ షాట్స్ అవసరం తప్పనిసరి అని పలువురు హెల్త్ ఎక్స్‌పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. అయితే ఇలా ఎంత కాలం అనే ప్రశ్నకే సమాధానం లభించడం లేదు. ఇజ్రాయెల్, బ్రిటన్‌ దేశాల్లో ఫైజర్ బూస్టర్ డోసుతో కరోనా వైరస్ నుంచి వచ్చే ఇన్‌ఫెక్షన్స్‌కి చెక్ పెట్టొచ్చని నిరూపితమైందని అక్కడి గణంకాలు స్పష్టం చేస్తున్నాయి. అంతేకాకుండా రోజువారీ కరోనావైరస్ పాజిటివ్ కేసులు సైతం తగ్గినట్టు ఆ గణాంకాలు చెబుతున్నాయి. అమెరికాలో బూస్టర్ డోసుపై జరిపిన అధ్యయనాల్లో వైరస్ పునరుత్పత్తి సంఖ్య కూడా తగ్గుతుందని తేలినట్టు తెలుస్తోంది.