వంటల్లో పసుపు అధికంగా వేస్తున్నారా? అయితే ప్రమాదం పొంచివున్నట్లే..

0
134

సాధారణంగా మహిళలు వంటల్లో పసుపు వేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతారు. ఇది వేయడం వల్ల రంగుతో పాటు రుచి కూడా బాగుంటుంది. పసుపు పరిమితంగా వాడడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు పొందవచ్చు. కేవలం ఆరోగ్య ప్రయోజనాలే కాకుండా..ముఖ్య సౌందర్యాన్ని పెంచడంలో కూడా సహాయపడుతుంది. మనం ముఖానికి వాడే వివిధ అంటిమెంట్స్ లో పసుపు ప్రధాన పాత్ర పోషిస్తుంది.

షుగ‌ర్‌ను, బీపీని, కొలెస్ట్రాల్‌ను త‌గ్గించ‌డంలో ప‌సుపు ఉపయోగపడుతుంది. దాంతో పాటు రోగ నిరోధ‌క శ‌క్తి కూడా పెంచే అద్భుత గుణం దీనిలో ఉంటుంది. ద‌గ్గు, జ‌లుబు వంటి సీజ‌న‌ల్ వ్యాధులను కూడా తగ్గించి ఊపిరితిత్తులను శుభ్రం చేస్తుంది. కానీ పసుపు వంటల్లో అధికంగా వాడడం వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువగా  చేకూరే అవకాశం అవకాశం ఉంటుంది.

రోజుకు ఒక గ్రామ్ మోతాదులో మాత్ర‌మే ప‌సుపును తీసుకోవాలి. చిన్నారుల‌కు పావు గ్రామ్ ఇవ్వడం మంచిది. దీని అర్ధం పెద్ద‌లు సుమారుగా 1000 మిల్లీగ్రాములు, చిన్నారులు 250 మిల్లీగ్రాముల మోతాదులో ప‌సుపును తీసుకోవాలి. లేదంటే జీర్ణసంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. వాంతులు, విరేచ‌నాలు, క‌డుపునొప్పి వంటి సమస్యలతో పాటు కిడ్నీ స్టోన్స్ ఏర్ప‌డే అవకాశాలు ఉంటాయి.