ఎలాంటి జుట్టు సమాసాలకైనా చెక్ పెట్టే సింపుల్ చిట్కా ఇదే?

0
104

స్త్రీలు అందంగా ఉండడానికి ఎల్లప్పుడూ వివిధ రకాల చిట్కాలు పాటిస్తూ ఉంటారు. స్త్రీలను అందంగా ఉంచడంలో జుట్టు ముఖ్య పాత్ర పోషిస్తుంది. కావున జుట్టును అందంగా, ఆరోగ్యంగా ఉంచుకోవ‌డానికి ఎంతో కష్టపడుతూ..విశ్వప్రయత్నాలు చేస్తుంటారు. జుట్టు న‌ల్ల‌గా, ఒత్తుగా, పొడుగ్గా ఉండ‌డానికి ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు అంటున్నారు నిపుణులు. అదేంటీ మీరు కూడా చూడండి..

సాధారణంగా మనందరి ఇళ్లలో దొరికే క‌రివేపాకుతో ఎలాంటి సమస్యలకైనా చెక్ పెట్టొచ్చు అంటున్నారు నిపుణులు. కేవలం ఆరోగ్య పరంగా ప్రయోజనాలే కాకుండా..జుట్టును న‌ల్ల‌గా, ఒత్తుగా చేసే శ‌క్తి కూడా క‌రివేపాకు ఉంది. మనం ముందుగా క‌రివేపాకు, గుంట‌గ‌ల‌గ‌రాకు తీసుకొని ఒక జార్ లో వేసి మెత్త‌ని పేస్ట్ లా చేసుకోవాలి.

ఆ తరువాత పేస్ట్ లా చేసుకున్న మిశ్రమాన్ని ఒక గిన్నెలో తీసుకొని మిశ్రమంలో రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల పుల్ల‌ని పెరుగును క‌లపాలి. తరువాత ఈ మిశ్రమాన్ని తీసుకుని కుదుళ్ల నుండి జుట్టు చివ‌ర్ల వ‌ర‌కు బాగా పట్టించి గంట తరువాత త‌ల‌స్నానం చేయాలి. ఇలా త‌ర‌చూ చేస్తుండ‌డం వ‌ల్ల మంచి ఫలితాలు లభిస్తాయి.