అప్పుడే పుట్టిన పిల్లలకు కనీళ్ళు రాకపోవడానికి గల కారణం ఇదే?

0
130

మనకు ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు వెంటనే ఏడుస్తాము. దానివల్ల కన్నీళ్లు కూడా వస్తాయి. కానీ అప్పుడే పుట్టిన పసిపాపలు విపరీతంగా ఏడ్చినా కన్నీళ్లు బయటకు రాకపోవడం ఆశ్చర్యకరమైన విషయమే. ఎందుకు కన్నీళ్లు రావు అనే విషయంపై శాస్త్రవేత్తలు పరిశోధన చేసి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

ఇలా జరగడం శిశువు శరీర అభివృద్ధికి సంబంధించినది. ఒక వ్యక్తి ఏడ్చినప్పుడల్లా కన్నీళ్లకు ఒక ప్రత్యేక రకమైన వాహిక బాధ్యత వహిస్తుంది. కానీ శిశువులో ఇది పూర్తిగా అభివృద్ధి చెందదు. ఈ నాళం అభివృద్ధి చెందడానికి కనీసం 2 వారాల సమయం పడుతుంది. అందుకే పిల్లలు ఏడిస్తే కన్నీళ్లు రావని పరిశోధనలో వెల్లడి అయింది.