పసుపు ఎక్కువగా వాడుతున్నారా? అయితే జాగ్రత్త

0
128

ప‌సుపు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే వంటల్లో పసుపుకు ఓ ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ప‌సుపు వంటల్లో వేయడం వల్ల కేవలం రంగులో మార్పే కాకుండా..అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కూడా పొందవచ్చు. కానీ పరిమిత స్థాయిని మించి తీసుకోవడం వల్ల అనేక దుష్ఫలితాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకో మీరు కూడా ఓ లుక్కేయండి..

పసుపును మనకు గాయాలు అయినా చోట పెట్టడం వల్ల తొందరగా నయం అవుతాయని పసుపును విరివిగా ఉపయోగిస్తుంటాము. కానీ పసుపును ఎక్కువగా ఉపయోగించడం వల్ల చర్మానికి హాని కలిగే అవకాశం ఉందని నిపుణులు చేబుతున్నారు. దీనివల్ల శరీరం దురద పెట్టడంతో పాటు..డ్రైగా మారుతుంది. ఇది కాస్త పొట్ట లైనింగ్ కు హాని కలిగించి గ్యాస్టిక్ సమస్యకు దారి తీస్తుంది.

అంతేకాకుండా పసుపును ఎక్కువగా ఉపయోగించడం వల్ల  లివర్ ఇన్ ఫెక్షన్ కు గురయ్యే అవకాశాలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా కాలేయ సంబంధిత సమస్యతో బాధపడేవారు పసుపుకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే పసుపులో ఉండే గుణాలు, మరింత కాలేయ సమస్యలను పెంచడంతో పాటు..వివిధ సమస్యలకు దారి తీస్తుంది.