వేసవిలో చాలామంది అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. మనం ఎంత జాగ్రత్తగా ఉన్న పలు రకాల సమస్యలు వేధిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా సమ్మర్ లో కిడ్నీల సమస్యతో బాధపడేవారి సంఖ్య అధికంగా ఉంటుంది. కావున ఈ సమస్య నుండి బయటపడాలంటే అధికంగా నీరు తాగాలి. కేవలం కిడ్నీల ఆరోగ్యం దెబ్బతినకుండా చేయడమే కాకుండా అనేక రకాల సమస్యలను కూడా మన దరికి చేరకుండా కాపాడుతుంది.
అందుకే మూత్రపిండాల్లో రాళ్లు సమస్య ఉన్నవారు వారి రోజువారీ ఆహారంలో ఇవి ఉండేలా చూసుకుంటే ఆ సమస్య నుండి త్వరగా బయటపడొచ్చు. అరటి, నిమ్మ, క్యారట్, కాకరకాయ, పైనాపిల్, కొబ్బరినీళ్లు, బార్లీ, ఉలవలు మూత్రపిండాల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇదిలా ఉంటేమూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే తత్వం ఉన్నవాళ్లు ఆకుకూరలు, టమాటాలు, మాంసాహారం, కాఫీ, టీ, తీపి పదార్థాలు, శీతల పానీయాలు, మద్యపానం వంటి వాటికీ ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.
వేసవిలో కిడ్నీల సమస్యతో పాటు..యూరినరీ ఇన్ఫెక్షన్ సైతం చాలామందిని వేధిస్తుంది. ఇన్ఫెక్షన్ కు కూడా ప్రధాన కారణం శరీరానికి సరిపడా నీళ్లుతాగకపోవడమే కారణమని తాజాగా చేసిన పరిశోధనలో వెల్లడయింది. ఈ ఇన్ఫెక్షన్కు కారణమయ్యే బ్యాక్టీరియాను మూత్రవిసర్జనతో శరీరంలోకి చొరబడకుండా చేయాలి. ఇందుకోసం వీలైనంత ఎక్కువ మూత్రవిసర్జన జరిగేలా ఎక్కువ మోతాదుల్లో నీళ్లు తాగుతూ ఉండాలి. వేసవి వేడిమికి తగ్గట్టు శరీరంలో నీటి మోతాదును సమంగా ఉంచుకుంటూ ఉండాలి.