జుట్టు రాలుతోందా? అయితే ఈ అద్భుతమైన చిట్కాలు మీకోసమే..

0
106

ప్రస్తుతం మహిళలను వేధించే సమస్యల్లో ఒకటి జుట్టు రాలడం. నేటి జీవన విధానం, ఆహారపు అలవాట్లే ఇందుకు కారణం. జుట్టు రాలిపోతుంటే కలిగే ఆందోళన అంతా ఇంతా కాదు. మరి పట్టులాంటి కురులకు అద్భుతమైన చిట్కాలు మీకోసం..

కలబంద..

కలబంద జుట్టుకు చాలా మంచిది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఇన్ఫెక్షన్‌తో పోరాడి స్కాల్ప్‌ని హెల్తీగా మార్చుతాయి. ఇది జుట్టు రాలడాన్ని కూడా నివారిస్తుంది.

గ్రీన్ టీ..

గ్రీన్ టీలోనూ యాంటీఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్ పుష్కలంగా ఉన్నాయి.

ఇది విటమిన్ ఎ, బి, సి, ఇ లకు చాలా మంచి మూలం. దురద, స్కాల్ప్, చుండ్రు, బ్యాక్టీరియాను తొలిగించేందుకు గ్రీన్ టీ సహాయపడుతుంది.

జుట్టు పెరుగుదల చర్మానికి చాలా వరకు సహాయపడుతుంది.

ఆక్సిజన్ , పోషకాల సరఫరా పెరుగుతుంది.

జుట్టు పెరుగుదలను మెరుగుపరుస్తుంది.

దీని కోసం రోజుకు రెండుసార్లు గ్రీన్ టీ త్రాగాలి.