జూలై 20వ తేదీ తొలిఏకాదశి ఆవుని ఇలా పూజిస్తే మీకు ఎంతో పుణ్యం

It is a great blessing for you to worship the toli Ekadashi cow on the 20th of July

0
110

2021 జూలై 20వ తేదీన ఎంతో పవిత్రమైన రోజు. ఆరోజు తొలి ఏకాదశి. ఈ రోజు ఆ విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన రోజు. అన్ని దేవాలయాలు భక్తులతో కిటకిటలాడతాయి. ముఖ్యంగా ఈరోజు గోవులకి ఆహరం పెట్టడం ఎంతో మంచిది. లేని వారికి సాయం చేయడం, పేదలకి బట్టలు, ఆహరం దానంచేస్తే ఆ లక్ష్మీ కటాక్షం ఉంటుంది. అంతేకాదు ఆ విష్ణుమూర్తి ఆశీస్సులు ఉంటాయి.

ముఖ్యంగా దేశంలో ఎక్కడ చూసినా తొలిఏకాదశి రోజున క్షీరాన్నం చేసుకుని ప్రసాదంగా స్వీకరిస్తారు. అంతేకాదు ఆ గోవుని కచ్చితంగా తాకి నమస్కరిస్తారు. అరటి పండ్లు లేదా ఆహార పదార్దాలు గోవుకి సమర్పిస్తారు. ఇలా చేస్తే ఆ భగవంతుడి ఆశీస్సులు ఉంటాయి.

గోవు తల భాగం కన్నా, వెనక భాగాన్ని భక్తులందరూ ఎంతో శ్రద్ధగా పూజిస్తారు. ఈ రోజున గోవుని నమస్కరించి, దానికి బొట్టుపెట్టి అరటి లేదా ఏరకమైన పండ్లు అయినా పెడితే ఇంట ధనలక్ష్మీ కటాక్షం ఉంటుంది అని చెబుతారు పండితులు.