శ్రావణమాసం సోమవారం ఇలా శివుడ్ని పూజిస్తే ఎంతో పుణ్యం

It is a great virtue to worship Shiva like this on Shravanamasam Monday

0
99

శ్రావణమాసం ఈనెల 9వ తేది నుంచి మొదలు కానుంది. ఇక పూజలు నోములు వ్రతాలతో ప్రతీ ఇంట్లో సందడి కనిపిస్తుంది.
శ్రావణ మాసం ఐదవ నెల. చంద్రుడు శ్రవణం నక్షత్రంతో కలిసిన రోజు కనుక ఈ నెలను శ్రావణ మాసం అంటారు.
ఈ నెలలో సోమవారాలు కూడా అత్యంత పవిత్రమైనవి. మంగళవారం శుక్రవారం అమ్మవారికి పూజలు లక్ష్మీదేవికి పూజలు కుంకుమార్చను చేస్తారు.

ఈ మాసంలో సోమవారం రోజున శివుడిని పూజిస్తే జన్మజన్మల ఫలం దక్కుతుందని పెద్దలు చెబుతారు. ఇక సోమవారం రోజున శివుడిని ప్రత్యేకంగా పూజించండి అభిషేకం చేసి ఉపవాసం ఉండి పేదలకు వస్త్ర దానం చేస్తే ఎంతో పుణ్యం.

ఈ నెలలో ప్రతీ రోజు శివపురాణం చదువుకుంటారు. ఈ శ్రావణ మాసంలో ప్రతీ సోమవారం శివుడికి తేనెతో పూజ చేస్తే..ఆరోగ్యం మెరుగవుతుంది. ఇక ఆ స్వామికి విభూదితో అభిషేకం చేసినా రుద్రాక్షలతో అభిషేకం చేసినా వ్యాపారాల్లో ఉద్యోగాల్లో ఎంతో పెరుగుదుల కనిపిస్తుందట. శివలింగానికి చెంబుడు జలంతో అభిషేకం చేసినా ఆ భోళాశంకరుడు మన కోరికలు తీరుస్తాడు అని పెద్దలు చెబుతారు.