మసాలా దినుసులు శరీరానికి మంచిది అని చెబుతారు. అయితే ఏది అయినా ఎంతలో తీసుకోవాలో అంతలో తీసుకోవాలి అతిగా తీసుకున్నా ప్రమాదమే. నల్ల మిరియాలు ఆరోగ్యానికి మంచివని చాలా మందికి తెలిసిన విషయమే. ఇక నల్ల మిరియాల కషాయం, నల్ల మిరియాల పాలు,నల్ల మిరియాల రసం, మిరియాల చారు చాలా మంది రోజూ తీసుకుంటారు. అయితే అతిగా తీసుకుంటే ప్రమాదం అంటున్నారు నిపుణులు.
శ్వాసకోశ వ్యాధులతో ఇబ్బంది పడుతున్నవారు నల్ల మిరియాలను డాక్టర్ల సలహాతో తీసుకోవాలి. జలుబు చేసిందని గొంతు నొప్పి అని చాలా మంది నల్ల మిరియాల రసం పాలు తాగుతారు. అయితే అది వేడి చేసి చేస్తే మాత్రం తాగవద్దు. ఎందుకంటే ఇంకా బాడీలో వేడి పెరుగుతుంది. ఇవి అధిక వేడిని కలిగిస్తాయి.
రోజూ తీసుకుంటే కడుపులో వేడి పెరుగుతుంది. అసిడిటి, గ్యాస్, పైల్స్ సమస్యలు వస్తాయి. గర్భిణీ స్త్రీలు వీటిని తీసుకోవద్దు అంటారు వైద్యులు. గ్యాస్ అసిడిటి సమస్యలు ఉంటే మీరు వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.