వారంలో ఏ రోజు తలస్నానం చేసి దీపారాధన చేస్తే మంచిది

It is better to take a bath any day of the week and worship

0
116

పూజలు చేసే సమయంలో మ‌నం దీపారాధన చేస్తాం. ఇది ఎంతో మంది పాటిస్తూ ఉంటారు. ఆలయాల్లో ఇంట్లో ఎక్కడ చూసినా ఇలా పూజ సమయంలో దీపాలు వెలిగిస్తారు. అయితే నిత్యం ఇంటిలో పూజలు చేసే వారు నిత్యం దీపం వెలిగించడం వల్ల ఇంటికి, అలాగే ఇంటిలో కష్టించి పని చేసే ఇంటి య‌జ‌మానికి ఎంతో మంచిదని ఎక్కడకు వెళ్లినా ఆ పనిలో విజయం వస్తుంది అని నమ్ముతారు.

అయితే ప్రతీ రోజు దీపం వెలిగించడం వలన ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది.
మనశ్శాంతి ప్రశాంతత ఉంటుంది. అయితే ఎవరు ఏ రోజు దీపం వెలిగిస్తే మంచిది అంటే పండితులు కొన్ని విషయాలు చెబుతున్నారు.

తలారా స్నానం చేసి స్త్రీలు, పురుషులు పూజ చేసే సమయంలో దీపం వెలిగించండి.
సోమవారం శివుడి ముందు పురుషులు దీపం వెలిగిస్తే మంచిది
మంగళవారం అమ్మవారి ముందు స్త్రీలు దీపం వెలిగిస్తే మంచిది
బుధవారం పురుషులు దీపం వెలిగిస్తే మంచిది
గురువారం పురుషులు దీపం వెలిగిస్తే మంచిది
శుక్రవారం స్త్రీలు దుర్గామాత, పార్వతి దేవి ముందు దీపం వెలిగిస్తే మంచిది
శనివారం స్త్రీలు దీపం వెలిగిస్తే మంచిది
ఆదివారం పురుషులు దీపం వెలిగిస్తే మంచిది
శుక్ర, మంగళవారం స్త్రీలు తులసి కోట ముందు దీపం పెడితే ఆ ఇంటికి ఎంతో మంచిది