చాలా మంది బరువు సమస్యతో బాధపడుతూ ఉంటారు ముఖ్యంగా అధిక బరువు స్ధూలకాయం ఉన్నవారికి ఎక్కువగా షుగర్ సమస్య వస్తోంది అంటున్నారు వైద్యులు… ఇది కచ్చితంగా మీరు గుర్తు ఉంచుకోండి ఈ ఒబెసిటీ సమస్య ప్రాధమికంగా గుర్తిస్తే వెంటనే బరువు తగ్గేలా చేసుకోవాలి అని తెలియచేస్తున్నారు.
ఇలా ఒబెసిటీ సమస్య రాకుండా ఉండాలి అంటే అతిగా తిన్నా దానికి తగ్గా చెమటోడ్చే పని చేయాలి లేకపోతే తిండి తగ్గించండి పంచదార షుగర్ ఐటెమ్స్ మానేస్తే బెటర్ కాఫీ టీలు తాగకండి.. ఇలా బరువు కొవ్వు పెరిగే వస్తువులు ఫుడ్ మానేస్తేనే మీకు ఈ సమస్య తగ్గుతుంది.
షుగర్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల ఫుడ్ కు దూరంగా ఉండాలి. కచ్చితంగా శరీర బరువుని నియంత్రించుకోవాలి, ఇక ఒకేచోట గంటల తరబడి కూర్చోవద్దు, శారీరక శ్రమ కచ్చితంగా ఉండాలి…ఒబేసిటీ కొందరికి వంశపారంపర్యంగా రావచ్చు, అధికంగా మందులు వాడటం వల్ల రావచ్చు , హార్మోనల్ లోపం వల్ల రావచ్చు. శారీరక శ్రమ వ్యాయామం జిమ్ ఇలా చేస్తూ ఉంటే ఎలాంటి సమస్యలు రావు, మిత ఆహారం తీసుకుంటే మంచిది.