కృష్ణాష్టమిరోజున కన్నయ్యకు ఇష్టమైన పదార్ధాలతో నైవేద్యం పెడితే ఎంతో మంచిది. మరి కన్నయ్యకు ఏవి నైవేద్యం పెడతారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. గోకులాష్టమి రోజున భక్తులు పగలు ఉపవాసం ఉండి, సాయంత్రం శ్రీకృష్ణుని పూజిస్తారు. ఊయల కట్టి అందులో శ్రీకృష్ణ విగ్రహాన్ని పెట్టి ఊపుతూ రకరకాల పాటలు పాడతారు. ఇలా పూజచేసి ఆయనకు ఇష్టమైన నైవేద్యం పెడతారు.
కృష్ణుడికి అటుకులు అత్యంత ప్రీతికరమనే విషయం తెలిసిందే. అటుకులతో చేసే ఆహారం ఏది అయినా పెట్టవచ్చు.
అటుకులు, బెల్లం కలిపి నైవేద్యంగా పెడతారు. ఇక ఉత్తరాధి ప్రాంతాల్లో పాయసాన్ని శ్రీకృష్ణుడికి నైవేద్యంగా సమర్పిస్తారు.
అప్పాలు బియ్యం పిండి, బెల్లంతో కలిపి తయారు చేస్తారు. వీటిని కూడా జన్మాష్టమి రోజు స్వామికి నైవేద్యంగా పెడతారు.
శ్రీ కృష్ణాష్టమి రోజున తాజా వెన్న కూడా నైవేద్యంగా పెడతారు.
పంచామృతం పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార, తులసి ఆకులు , వెన్నని ఇస్తారు.
బెల్లం, శనగ పప్పు తో చేసిన పదార్దాలు కూడా నైవేద్యంగా నివేదన చేస్తారు