గజలక్ష్మి దేవిని ఇలా పూజిస్తే ఎంతో మంచిది – సిరిసంపదలు వస్తాయట

It is very good to worship Gaja lakshmi like this

0
108

నిత్యం లక్ష్మీదేవిని కొలుస్తూనే ఉంటారు చాలా మంది. ముఖ్యంగా ఆమె కటాక్షం ఉంటే ఏదైనా సాధిస్తామని ధనలాభం ఉంటుంది అని నమ్ముతారు వ్యాపారాలు చేసేవారు. ఎవరైనా సరే లక్ష్మీదేవిని ఎంతగానో భక్తి శ్రద్దలతో కొలుస్తారు.లక్ష్మీదేవికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. విష్ణువు భార్య లక్ష్మిదేవి దీపావళి రోజున అమ్మవారికి అలంకరణ చేసి భక్తి శ్రద్దలతో పూజలు చేస్తారు.

లక్ష్మిదేవి నాలుగు చేతులతో వుంటుంది. రెండు చేతులతో పుష్పాలను పట్టుకొని రెండు చేతులతో బంగారు నాణేలను అనుగ్రహిస్తూ వుంటుంది. తామర పువ్వు మీద కూర్చుని ఏనుగులతో భక్తులను అనుగ్రహిస్తుంది అమ్మవారు. ఇలాంటి విగ్రహాలను దేవుడి పటాలను దేవుడి గూటిలో పెట్టుకుంటారు భక్తులు.

అష్టలక్ష్ముల్లో ఒకరు గజలక్ష్మి దేవి. తామర పువ్వులో పద్మాసనం మీద కూచుంటుంది గజలక్ష్మి. ఆమెకి ఇరువైపులా రెండు ఏనుగులు ఉంటాయి. ఇలాంటి ఫోటోలను దేవుడి గూటిలో పెట్టుకుని నిత్యం పూజిస్తే ఆ ఇంటికి ఎంతో మంచిది. అమ్మవారికి కుంకుమ పసుపు పువ్వులతో పూజ కుంకుమార్చ‌న‌ చేస్తే ఎంతో పుణ్యం ధనలక్ష్మీ కటాక్షం ఆ ఇంటశాంతి ఉంటుంది.