పరమేశ్వరుడిని ఈ పువ్వులతో పూజిస్తే ఎంతో పుణ్యమట

It is very sacred to worship God with these flowers

0
109

పరమేశ్వరుడికి సోమవారం ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. ఈరోజు ఆ స్వామిని కోట్లాది మంది భక్తులు దర్శించుకుంటారు. అభిషేకాలు చేస్తారు. అయితే శంకరుడికి చెంబుడు నీరు అభిషేకంగా పోసినా ఆయన ఆనందిస్తాడు అని చెబుతారు. అందుకే ఆయనని అభిషేక ప్రియుడు అంటారు. అయితే శివుడికి ఎలాంటి పువ్వులు ఇష్టం అనేది చూస్తే పురాణాల ప్రకారం మహా శివుడికి బిళ్వ వృక్షం ఆకులన్నా, పువ్వులన్నా చాలా ఇష్టం అని చెబుతారు పండితులు.

అయితే ఇవి ఎక్కడపడితే అక్కడ కనిపించవు, గతంలో శివాలయాల్లో వీటిని నాటేవారు పెంచేవారు. ఈ పువ్వులు ఆకులతో పూజ చేస్తే ఎంతో పుణ్యం అని చెబుతారు పండితులు. ఇక ఈ పువ్వులతో పూజిస్తే వారికి ఎలాంటి కోరికలు ఉన్నా ఏనాటి నుంచో ఉన్న సమస్యలు కూడా తీరిపోతాయి అని చెబుతారు.

అయితే ఈ పువ్వులు చాలా అరుదుగా ఉంటాయి కనుక ఇవి దొరకకపోతే బిళ్వ ఆకులు అయినా పూజకు వాడవచ్చు. ఇలా ఉత్తరాధిన చాలా ఆలయాల్లో వీటిని నాటుతారు. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇవి కనిపిస్తాయి. ముఖ్యంగా అడవుల్లో ఇలాంటి చెట్లు ఎక్కువగా ఉంటాయి.