ఈ భూమి మీద జీవించే హక్కు మనుషులకే కాదు ఇతర జంతువులకి కూడా ఉంది.. అలాగే సమస్త ప్రాణులకి మొక్కలకి కూడా ఉంది… మనం స్వార్ధంతో ఈ భూమిని వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాము.. దీనిప్రభావం ఇతర జీవులపై ప్రాణులపై కూడా పడుతోంది..చెత్తా ప్లాస్టిక్ తో అంతా డ్రైనేజీ, సముద్రాలు, చెరువులు, నదులు, ఇలా ఎక్కడ పడితే అక్కడ వ్యర్థాలు ఉండిపోతున్నాయి. దీని వల్ల ఎన్నో జీవులు చనిపోతున్నాయి, కొన్ని అంతరించిపోయాయి కూడా.
సింగిల్ యాజ్ ప్లాస్టిక్ను వాడవద్దని సూచిస్తోంది కేంద్ర ప్రభుత్వం… అయినా కొందరు వీటిని తయారు చేస్తున్నారు కొందరు వాడుతున్నారు.. దయచేసి ఇలా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని వాడకండి. అయితే ఇలాంటి వస్తువులు భూమిలో కలవడానికి ఎంత సమయం పడుతుంది అనేది ఓసారి చూద్దాం.
ప్లాస్టిక్ బ్యాగ్ – 500-1000 ఏళ్లుకాలం పడుతుంది.
మిల్క్ కవర్లు దాదాపు 5 సంవత్సరాలు
వాటర్ బాటిల్ 10 నుంచి 20 ఏళ్లు
అల్యూమినియం క్యాన్ – 80-200 ఏళ్లు సమయం పడుతుంది
జిప్ ఉండే బ్యాగ్స్ – 500-1000 ఏళ్లు సమయం పడుతుంది భూమిలో కలవడానికి
డ్రింకులు తాగే ప్లాస్టిక్ స్ట్రా – 200 ఏళ్లు సమయం పడుతుంది
టూత్ బ్రష్ – 400 ఏళ్లు
పిల్లల డైపర్లు – 500-800 ఏళ్లు కాలం పడుతుంది