కొందరికి నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. మాంసం లేనిదే ముద్ద దిగదు అంటారు. చికెన్ మటన్ రొయ్యలు పీతలు లేకపోతే చేపలు ఏదో ఒకటి కంచంలో ఉండాల్సిందే. చాలా మంది ఇలా అతిగా చికెన్ తింటూ ఉంటారు. పైగా ప్రొటీన్ ఫుడ్ కదా శరీరానికి మంచిదే అని అంటారు. అయితే రోజూ చికెన్ తింటే అనేక సమస్యలు తప్పవు అంటున్నారు నిపుణులు.
ప్రోటీన్స్ కోసం చికెన్ తినడం మంచిదే కానీ రోజూ తినడం మాత్రం ప్రమాదమే. వారానికి ఒకసారి చికెన్ తింటే మంచిది అది కూడా నాటు కోడి తీసుకుంటే మంచిది అంటున్నారు నిపుణులు. ఓ విషయం ప్రతీ ఒక్కరు గుర్తు ఉంచుకోవాలి మనం తినే ఫుడ్ లో 35 పర్సెంట్ ప్రొటీన్ మించకుండా తీసుకోవాలి. చికెన్ ద్వారా వచ్చే ప్రోటీన్ను బాడీ ఫ్యాట్గా మార్చి లోపలే ఉంచుతుంది.
ఇలా అతిగా చికెన్ తింటే కొవ్వు పెరుగుతుంది బ్లడ్ లెవెల్స్ పెరుగుతాయి. ఊబకాయం బరువు పెరుగుతారు. ఇలాంటి సమయంలో హార్ట్ అటాక్ సహా గుండె సంబంధిత జబ్బులు వచ్చే ప్రమాదం ఉంటుంది. చికెన్ ఎప్పుడు చేసుకున్నా సరిగ్గా ఉడికించి తీసుకోవాలి .ప్రోటీన్స్ కోసం బాదం, గుడ్లు, చేపలు, పప్పులు, గింజలు ఇలాంటివి తినడం మేలు.