ఇదేంటి దోమల్లో కూడా అందమైనవి అందవికారమైనవి ఉంటాయి అని అనుకుంటున్నారా? ఆడదోమ మగదోమ చూశాం కాని ఈ అందమైన దోమ ఏమిటి అని ఆశ్చర్యం కలుగుతోందా. ఈ దోమలు చాలా డేంజర్ ఎన్నో వ్యాధులని తీవ్ర జ్వరాలకి గురిచేస్తాయి. చూడటానికి చిన్నగా ఉంటుంది కాని ఇది పెట్టే టార్చర్ అంతా ఇంతా కాదు. సీజనల్ వ్యాధులకు కారణమైన దోమలు రాకుండా కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి.
సరే ఇంతకీ ఈ అందమైన దోమ గురించి చెప్పుకుందాం. ఇది చూడటానికి అందమైన ఈకలు కలిగి ఉంటుంది. రంగు రంగుల కాళ్లతో ఉంటుంది. ఇది ఎక్కడ ఉంది అంటే ? దక్షిణ అమెరికాలోని ఉష్ణమండల అడవుల్లో కనిపిస్తాయి. వీటిని సబెథెస్ మస్కిటోస్ అని పిలుస్తారు. చూడటానికి ఆకుపచ్చ రంగుతో ఉంటాయి.
ఈ దోమలు ఎప్పడూ గుంపులుగుంపులుగా సంచరిస్తుంటాయి. ఇవి చాలా అంటే చాలా రేర్ గా వేరే ప్రాంతాల్లో కనిపిస్తాయి, కేవలం ఇక్కడ మాత్రమే ఇవి కనిపిస్తాయట.