జీడిపప్పు కొంచెం ఖరీదు ఉన్నా ఇది తింటే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి, మరీ ముఖ్యంగా చాలా మంది సన్నగా ఉన్న వారు కూడా జీడిపప్పు తింటారు, అయితే వైద్యులు కూడా మితంగా జిడిపప్పు తినవచ్చు అని చెబుతున్నారు, కొందరు అయితే బాగా ఫ్యాట్ వస్తుంది అని భయపడతారు, అయితే జీడిపప్పు తినడం వల్ల ఏదైనా చేటా మంచిదా అనేది చూద్దాం.
జీడిపప్పు చెడు కొలెస్ట్రాల్ను బయటికి పంపి మంచి కొలెస్ట్రాల్ను అందిస్తుంది. జీడిపప్పులో కాపర్, ఫాస్పరస్, జింక్, ఐరన్, మాంగనీస్, సెలీనియంతో పాటు అనేక రకాల విటమిన్లు, ప్రోటీన్స్, యాంటీ యాక్సిడెంట్లు లభిస్తాయి. ఇక రోజుకి పది పలుకులు తిన్నా మంచిదే.
ఇక బెల్లం జీడిపప్పు కలిపి తీసుకుంటే ఐరెన్ సమస్య ఉండదు శరీరానికి, అలాగే రక్తపోటు సమస్య ఉండదు , గుండె జబ్బులు కూడా రాకుండా ఉంటాయి.. ఇమ్యనిటీ పవర్ పెంచుతుంది, ఇక ఇందులో ఉంటే లుటిస్ వల్ల కంటి చూపు బాగుంటుంది, ఇందులో మితంగా కాపర్ కూడా శరీరానికి అందుతుంది, ఇక దంతాలు కూడా బాగుంటాయి..నరాల బలహీనత రాకుండా చేస్తుంది. ఇక నిద్ర పట్టని వారు రోజూ జీడిపప్పు ఓ పది పలుకుని తినండి .. మానసిక ఉల్లాసం ఉంటుంది, నిద్ర పడుతుంది, మల బద్దకం జీర్ణ సమస్యలు కూడా తగ్గుతాయి, నిత్య యవ్వనంగా కనిపిస్తారు.