కడుపుతో ఉన్న మహిళ స్వీట్స్ పంచదార తీసుకోవచ్చా ? వద్దా?

కడుపుతో ఉన్న మహిళ స్వీట్స్ పంచదార తీసుకోవచ్చా ? వద్దా?

0
93

మహిళ ప్రెగ్నెంట్ గా ఉన్న సమయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి, ఈ సమయంలో తీసుకునే ఆహరం కూడా ఎంతో జాగ్రత్తగా తీసుకోవాలి, ఏది పడితే అది గర్భిణీ మహిళలు తీసుకోకూడదు..
కడుపుతో ఉన్న మహిళకు చాలా రకాల కోరికలు ఉంటాయి.ఏవేవో తినాలని అనిపిస్తుంది. రకరకాల ఫుడ్ ఐటెమ్స్ తినాలనిపించడం సహజమే కాని ఇష్టం వచ్చిన రకాల ఫుడ్ తీసుకోకూడదు.

ముఖ్యంగా ఏది తిన్నా తల్లి బిడ్డపై ప్రభావం చూపిస్తుంది, అలాగే స్వీట్స్ ఎక్కువగా తీసుకోవచ్చా, పంచదార ఎక్కువగా తీసుకోవచ్చా అంటే వైద్యులు కొన్ని విషయాలు చెబుతున్నారు. అసలు స్వీట్లు పంచదార చాలా తక్కువుగా తీసుకోవాలని చెబుతున్నారు.

షుగర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ తీసుకోవడం వల్ల తల్లీ, బిడ్డా కూడా ఒబేసిటీ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి రావచ్చు. పిల్లలు పుట్టే సమయానికే ఎక్కువ బరువు ఉండొచ్చు, పుట్టాక బరువు పెరగొచ్చు. పిల్లలకే కాక తల్లికి కూడా ఇది సమస్యనే. తర్వాత బరువు తగ్గడం కష్టం అవుతుంది, అలాగే వెయిట్ తగ్గడానికి చాలా సమయం తీసుకుంటుంది, అనేక వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది, అయినా కొందరిలో ఈ వెయిట్ తగ్గదు, అదే ముందు నుంచి షుగర్ ఐటెమ్స్ కంట్రోల్ లో ఉంటే ఏ సమస్య ఉండదు.

అంతేకాదు స్వీట్స్ ఎక్కువగా తింటే పిల్లలకి చిన్నప్పుడే గుండెకి సంబందించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది అందుకని, ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు తియ్యగా ఏమైనా తినాలనిపిస్తే పండ్లు తినడం మంచిది. ఇక జ్యూస్ తీసుకున్నా అందులో పంచదార లేకుండా తీసుకోవడం ఉత్తమం.