ఖర్జూరాలు తింటే కలిగే లాభాలు ఇవే అస్సలు మిస్ అవ్వద్దు

ఖర్జూరాలు తింటే కలిగే లాభాలు ఇవే అస్సలు మిస్ అవ్వద్దు

0
137

పండ్లు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే వైద్యులు కూడా ఈపండ్లు ఎక్కువ తీసుకోమంటారు, ఇక ఉపవాసాలు ఉండే సమయంలో చాలా మంది ఖర్జూరాలు తీసుకుంటారు, అలాగే కొందరు ఉదయం ఎండుఖర్జూరాలను నానబెట్టిన నీటిని తాగుతారు, అయితే ఇది శరీరానికి చాలా మంచిది, షుగర్ బదులు ఈ ఖర్జూరాలు వాడితే ఇంకా మంచిది అని వైద్యులు చెబుతున్నారు.

పోషకవిలువలతో సమృద్ధిగా ఉండడం వల్ల నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడతాయి. ఇందులో కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, పొటాషియం, మెగ్నీషియం, జింక్ ఉన్నాయి. ఇక ఉదయం స్నాక్ ఈవినింగ్ స్నాక్ గా కూడా చాలా మంది తీసుకుంటారు.

జ్యూస్ లో వేసుకుంటే ఆ టేస్ట్ ఇంకా బాగుంటుంది, అయితే ఇవి తినడం వల్ల కొవ్వు మన శరీరానికి పట్టదు, ఎందుకు అంటే ఖర్జూరాల్లో కొలెస్ట్రాల్ అసలు లేదు, అంతేకాదు, కొవ్వు కూడా చాలా తక్కువగా ఉంటుంది. డైరెక్ట్ చక్కర తింటే అనేక సమస్యలు వస్తాయి, కాని తిపిగా ఉండే ఈ ఖర్జూరాలు తింటే ఎలాంటి సమస్య ఉండదు, బరువు పెరుగుతాము అనే భయం ఉండదు..ఖర్జూరాలలో సెలీనియం, మాంగనీస్, కాపర్, మెగ్నీషియం పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఎముకలకి బలాన్నిస్తాయి, ఇవి రోజుకి రెండు తిన్నా మలబద్దకం సమస్య తగ్గుతుంది. ఇవి తింటే చర్మం కాంతివంతంగా కూడా ఉంటుంది.