కరక్కాయ కన్న తల్లి..సర్వ వ్యాధులకు సమాధానం అంటున్న నిపుణులు

0
205

ఆరోగ్యానికి తల్లి వంటిది క‌ర‌క్కాయ. దీనిని ఉప‌యోగించ‌డం వ‌ల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు. పిల్ల‌ల‌కు, పెద్ద‌ల‌కు వ‌చ్చే అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను క‌ర‌క్కాయ‌ను ఉప‌యోగించి న‌యం చేసుకోవ‌చ్చు. కర‌క్కాయ వ‌గ‌రు, తీపి, చేదు రుచుల‌ను క‌లిగి శ‌రీరానికి చ‌లువ చేసే గుణాన్ని క‌లిగి ఉంటుంది.

కరక్కాయ చూర్ణాన్ని రోజువారీగా మోతాదుకు టీ స్పూన్ చొప్పున రెండు పూటలా సమాన భాగం బెల్లంతోగాని, అర టీస్పూన్ శొంఠి పొడితో గాని, పావు టీ స్పూన్ సైంధవ లవణంతో గాని కలిపి తీసుకుంటే ఆకలి పెరుగుతుంది.

కరక్కాయలు, పిప్పళ్లు, సౌవర్చలవణం వీటిని సమానంగా తీసుకొని విడివిడిగా పొడిచేసి, అన్నీ కలిపి నిల్వచేసుకొని మోతాదుగా అర టీ స్పూన్ చొప్పున అర కప్పు నీళ్లతో కలిపి తీసుకుంటే ఆకలి పెరుగుతుంది.

పేగుల్లోనూ, ఛాతి భాగంలోనూ, గొంతు భాగంలోనూ మంటగా అనిపిస్తుంటే కరక్కాయ చూర్ణాన్ని ఎండు ద్రాక్షతో కలిపి నూరి తేనె, చక్కెర చేర్చి తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది.

అజీర్ణంతో ఇబ్బంది పడుతున్నప్పుడు, పరిపూర్ణమైన బలంతో ఉన్నవారు ఆహారానికి గంట ముందు కరక్కాయ చూర్ణాన్ని, శొంఠి చూర్ణాన్ని సమభాగాలుగా కలిపి టీ స్పూన్ మోతాదుగా, అర కప్పు నీళ్లతో తీసుకోవాలి.

కరక్కాయలు, పిప్పళ్లు, శొంఠి వీటిని త్రిసమ అంటారు. వీటిని సమాన భాగాలుగా చూర్ణంగా చేసి తీసుకుంటే ఆకలి పెరగటమే కాకుండా అతి దప్పిక నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.

కరక్కాయ చూర్ణాన్ని, వేపనూనె బెరడు చూర్ణాన్ని సమాన భాగాలుగా కలిపి మోతాదుగా అర టీ స్పూన్ చొప్పున అర కప్పు నీళ్లతో కలిపి రెండుపూటలా తీసుకుంటే ఆకలి పెరగటంతోపాటు చర్మంమీద తరచూ తయారయ్యే చీముగడ్డలు, చర్మ సంబంధమైన ఫంగల్ ఇనె్ఫక్షన్లు, తామరచర్మ రోగాలూ వీటన్నిటినుంచీ ఉపశమనం లభిస్తుంది.

అజీర్ణం, ఆమ దోషం,అర్శమొలలు, మలబద్దకం సమస్యలతో రోజువారీగా కరక్కాయ చూర్ణాన్ని అర చెంచాడు చొప్పున సమాన భాగం బెల్లంతో కలిపి తీసుకుంటే హితకరంగా ఉంటుంది.

అధిక లాలాజలస్రావంతో ఇబ్బందిపడేవారు కరక్కాయ చూర్ణాన్ని భోజనం తరువాత అర టీ స్పూన్ మోతాదుగా అర కప్పు నీళ్లతోగాని, చెంచాడు తేనెతోగాని కలిపి తీసుకోవాలి.

మసిలే గోమూత్రంలో కరక్కాయలను వేసి ఉడికించి అరబెట్టి, దంచి పొడిచేసి నిల్వచేసుకోవాలి. దీనిని ప్రతిరోజూ ఉదయం అర టీ స్పూన్ మోతాదుగా లేదా ఎవరి బలాన్నిబట్టి వారు మోతాదును నిర్ణయించుకొని గాని, తేనెతో కలిపి తీసుకుంటే మొలల వ్యాధినుంచి ఉపశమనం లభిస్తుంది.

కరక్కాయల చూర్ణాన్ని, బెల్లాన్ని కలిపి భోజనానికి ముందు చెంచాడు మోతాదుగా రెండు పూటలా తీసుకుంటూ ఉంటే పైల్స్ తగ్గుతాయి.

పైల్స్‌వల్ల మలద్వారం వద్ద దురద తయారై ఇబ్బంది పెడుతుంటే కరక్కాయ చూర్ణాన్ని అర చెంచాడు మోతాదుగా సమాన భాగం బెల్లంతో కలిపి ఉండచేసి తినాలి.

అర్శమొలలు మొండిగా తయారై ఇబ్బంది పెడుతున్నప్పుడు కరక్కాయల చూర్ణం, బెల్లం సమంగా కలిపి అర చెంచాడు మోతాదులో వాడాలి. తరువాత ఒక గ్లాసు మజ్జిక తాగాలి. ఇలా రెండు పూటలా చేయాలి.

కరక్కాయలు, నల్ల ద్రాక్ష వీటిని పచ్చిగా ఉన్నప్పుడు ముద్దుచేసి గాని లేదా ఎండబెట్టి, పొడిచేసి గాని పూటకు టీ స్పూన్ చొప్పున రెండు పూటలా తీసుకుంటే శరీరాంతర్గతంగా జరిగే రక్తస్రావాలు, పెరుగుదలలు, దీర్ఘకాలపు జ్వరం వంటివి తగ్గుతాయి.

కరక్కాయ చూర్ణాన్ని అర టీ స్పూన్ చొప్పున సమాన భాగం తేనెతో కలిపి తీసుకుంటే శరీరాంతర్గతంగా జరిగే రక్తస్రావాలు ఆగటంతో పాటు కడుపునొప్పి, ఆమాతిసారం వంటివి తగ్గుతాయి.

కరక్కాయ చూర్ణాన్ని ముచ్చటి మాత్రలో తేనెతో కలిపి అవసరానుసారం మూడు నాలుగు సార్లు తీసుకుంటే వాంతులు, వికారం వంటివి సమసిపోతాయి.