కారం మిర్చి ఎక్కువగా తినే అలవాటు ఉందా వైద్యులు ఏమంటున్నారంటే

కారం మిర్చి ఎక్కువగా తినే అలవాటు ఉందా వైద్యులు ఏమంటున్నారంటే

0
100

చాలా మంది ఆహారం తీసుకునే సమయంలో ఉప్పు కారం లేకపోతే అది తినడం వేస్ట్ అంటారు.. నిజమే అందులో ఎన్ని వేసినా ఉప్పు కారం లేకపోతే దాని రుచి ఉండదు, అందుకే ఉప్పుకి కారానికి అంత రుచి వస్తుంది, ఇక చాలా మంది కారం ఎక్కువగా తీసుకుంటారు.. ముఖ్యంగా పచ్చిమిర్చి ఎండుమిర్చి కారప్పొడి, చిల్లి గింజలు కూడా ఎక్కువగా తింటూ ఉంటారు.

ఉప్మా చపాతి దోశ లేదా రైస్ ఇలా ఏది తీసుకున్నా ఇంత కారం వేసుకుని తింటారు.. ఈ ఘాటు కొందరికి అస్సలు పడదు… మరికొందరికి మాత్రం ఈ మాత్రం ఘాటు ఉండాల్సిందే అంటారు, అయితే ఇంత కారం తినవచ్చా, నిజంగా బీపీ అసిడిటీ, అల్సర్లు గ్యాస్ మంట వస్తుంది అని భయపడతారు.

అయితే అతిగా కారం తినే వారికి ఇటీవల ఓ అధ్యయనంతో తేలింది ఏమిటి అంటే.. ఇలా అతిగా కారం తిన్నా ఏ ప్రమాదం ఉండదు.. అంతేకాదు అలాంటి వారికి నొప్పుల సమస్యలు ఉండవట
యాంటీఇన్ఫ్లమేటరీ బ్లడ్ సెల్స్ కూడా సక్రమంగా పని చేస్తాయట. ఘాటు పదార్ధాలు ఎక్కువగా తింటే వాళ్ల ఆయుర్ద్యాయం కూడా పెరుగుతుంది అని తేలిందట, అయితే కొందరికి వారి శరీరం బట్టి కారం పడదు అలాంటి వారు దూరంగానే ఉండాలి అని వైద్యులు చెబుతున్నారు.

కారం ఎక్కువగా తిన్నా ఎలాంటి ప్రాబ్లమ్స్ కనిపించకుండా ఉంటాయో వారే తినవచ్చు అని అంటున్నారు, ఇక అల్సర్లు కడుపు మంట ప్రాబ్లమ్ ఉంటే కారం తినకుండా ఉంటే బెటర్.