బ్రేకింగ్ న్యూస్ ….పాము గ‌బ్బిలాల వల్ల కాదు క‌రోనా ఈ జీవి వ‌ల్లే వ‌స్తోంది

బ్రేకింగ్ న్యూస్ ....పాము గ‌బ్బిలాల వల్ల కాదు క‌రోనా ఈ జీవి వ‌ల్లే వ‌స్తోంది

0
105

చైనాలో డాక్ట‌ర్లు దాదాపు 20 రోజుల నుంచి క‌రోనా వైర‌స్ దేని వ‌ల్ల వ‌స్తోంది అనేదానిపై ప‌రిశోధ‌న‌లు చేస్తూనే ఉన్నారు… ముఖ్యంగా పాములు గ‌బ్బిలాల వ‌ల్ల ఈ వైర‌స్ వ‌స్తుంది అని ముందు చెప్పారు, అయితే త‌ర్వాత ఇది కాదు అని పంది ఎలుక మాంసం వ‌ల్ల వ‌చ్చింది అని మ‌రికొంద‌రు చెప్పారు.

దీంతో పొంత‌న లేని స‌మాధానాలు చైనా చెబుతోంది.. దీనిపై ప్ర‌పంచంలో మెడిక‌ల్ ల్యాబ్స్ లో చాలా దేశాలు టెస్ట్ లు చేస్తున్నాయి …ఇది ప్ర‌మాంత‌క‌ర‌మైన వైర‌స్ అనే చెబుతున్నారు.. తాజాగా మ‌రో జీవి వ‌ల్ల క‌రోనా వ‌స్తోంది అని వైద్యులు చెబుతున్నారు.

తాజాగా, అలుగు (పాంగొలిన్) కూడా ఇందుకు కారణం కావొచ్చని అభిప్రాయపడుతున్నారు డాక్ట‌ర్లు ఎందుకు అంటే వీటి జన్యుక్రమం కరోనా కొత్త తరహా వైరస్‌తో 99 శాతం సరిపోలుతోందని శాస్త్రవేత్తలు తెలియ‌చేశారు. చైనా సహా మరికొన్ని దేశాల్లోనూ అలుగులను తింటారు. దీంతో వైరస్ వ్యాప్తికి ఇదే కారణం అయి ఉంటుందని శాస్త్రవేత్తలు వెల్ల‌డిస్తున్నారు. ఈ వైర‌స్ వ‌ల్ల 630 మంది మ‌ర‌ణించారు 31,000 మందికి ఈ వ్యాధి సోకింది