కార్తీకమాసమని చన్నీళ్లతో తలస్నానం చేస్తున్నారా వైద్యుల సలహా

కార్తీకమాసమని చన్నీళ్లతో తలస్నానం చేస్తున్నారా వైద్యుల సలహా

0
111

చాలా మంది ఈ కార్తీకమాసమని చన్నీళ్లతో తలస్నానం చేస్తూ ఉంటారు, మరీ ముఖ్యంగా పూజలు వ్రతాలు అని చాలా మంది ఇలా తలకు స్నానం చేస్తారు, అంతేకాదు గోదావరి నది చెరువులు కాలువల్లో కూడా ఇలా స్నానం చేస్తూ ఉంటారు, తలకి ఇలా స్నానం చేయడం వల్ల చల్లనీరు వల్ల చాలా ఇబ్బందులు వస్తాయి, మరీ ముఖ్యంగా అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి అంటున్నారు వైద్యులు.

ఇది కరోనా సమయంలో ఇప్పుడు చలినీరు అస్సలు స్నానం చేయకండి, అంతేకాదు ఈ కరోనా సమయంలో వేడి నీరు మాత్రమే స్నానం చేయండి, అంతే కాదు తలకి ఎట్టి పరిస్దితిలో మీరు చలి నీరు పోసుకోవద్దు అంటున్నారు, ఇలా చేస్తే జలుబు సమస్య మరింత వేధిస్తుంది కరోనా లక్షణాలు ఉన్నవారు కూడా ఇలా చేయవద్దు, దాదాపు వచ్చే ఏడాది జనవరి వరకూ ఇలా వేడి నీరు మాత్రమే స్నానం చేయండి అంటున్నారు వైద్యులు.

కార్తీకమాసం కాబట్టి పొద్దున్నే లేచి చల్లని నీళ్లతో తలస్నానం చేయాలని ఆలోచించే వారు ఇక దానికి బ్రేక్ ఇవ్వండి, ఇప్పుడు బయట స్నానాలు మంచిది కాదు మీరు నదిలో చెరువులో కాలువలో స్నానం కూడా చేయవద్దు అని తెలియచేస్తున్నారు నిపుణులు, సో కరోనా సమయంలో ఇంటి సభ్యులు అందరూ ఈ జాగ్రత్తలు పాటించండి. తలస్నానం చేయాలి అనిపించినా వేడి నీటినే చేయండి.