కరోనాపై కేసీఆర్‌ సర్కార్‌ కీలక నిర్ణయం..నిబంధనలు అమలు

0
116

చైనాలో పురుడు పోసుకున్న ఈ కరోనా మహమ్మారి వల్ల అన్ని దేశాల ప్రజలను అతలాకుతలం చేసింది. కరోనా విజృంభణ తగ్గినట్టే తగ్గి మళ్ళి విరుచుకుపడుతుంది. మన పొరుగు దేశం అయినా చైనాలో రోజుకు 20 వేలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. అంతేకాకుండా ఢిల్లీలో కరోనా మహమ్మారి కేసులు పెరుగుతున్నాయి.

దాంతో కేసీఆర్ సర్కార్ అలర్ట్ జారీ చేస్తుంది. పాత నిబంధలను మళ్ళి అమలు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు టాక్ వినిపిస్తుంది. ఫోర్త్ వేవ్ తప్పదని తెలంగాణ రాష్ట్ర వైద్య శాఖ కూడా అప్రమత్తమైంది. అందుకే అందరు జాగ్రత్తగా వైద్య శాఖ అధికారులు సూచిస్తున్నారు. మళ్ళి మాస్కులు పెట్టుకోవడం, చేతులు శానిటైస్ చేసుకోవడం వంటి నిబంధనలు పాటించమని సూచిస్తున్నారు.

గ‌డిచిన 24 గంట‌ల్లో తెలంగాణ రాష్టంలో 24 కరోనా వైర‌స్ పాజిటివ్ కేసులునమోదయ్యాయి. అలాగే నేడు రాష్ట్ర వ్యాప్తంగా 22 మంది క‌రోనా నుండి కోలుకున్నారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో ప్ర‌స్తుతం 222 క‌రోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.