Breaking News : మళ్లీ లాక్ డౌన్ షురూ

Kerala state announced to week end lockdown

0
152

కేరళలో మరోసారి కరోనా విజృంభిస్తోంది. కేరళలో నిన్న ఒక్కరోజే రికార్డు స్థాయిలో 22 వేల 56 మంది కొత్తగా కరోనా బారిన పడ్డారు.దీంతో  ఆ రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 33 లక్షల 27 వేలు దాటింది. ఇక మరణాలు కూడా అదే స్థాయిలో పెరిగాయి. నిన్న కేరళలో కరోనా కారణంగా 131 మంది చనిపోయారు.

మలప్పురం, త్రిస్సూర్,కోజికోడ్, ఎర్నాకుళం,పాలక్కడ్, కొల్లాం, అలప్పుజా, కన్నూర్, తిరువనంతపురం, కొట్టాయం జిల్లాల్లో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది. ప్రస్తుతం 4 లక్షల 46 వేల మంది వివిధ జిల్లాల్లో డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారు. కేసుల పెరుగుదలతో అప్రమత్తమైన కేరళ సర్కార్ వచ్చే శని,ఆదివారాలు పూర్తి లాక్ డౌన్ ప్రకటించింది.

కేంద్ర ప్రభుత్వం ఆరుగురు సభ్యులతో కూడిన బృందాన్ని కేరళకు పంపిస్తుందన్నారు కేంద్ర వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవ్య. ఈ టీంకు నేషనల్ సెంటర్ ఆఫ్ డిసీజ్ కంట్రోల్ డైరెక్టర్ నేతృత్వం వహించనున్నారు. కేరళలో కరోనా కంట్రోల్ కోసం రాష్ట్ర ప్రభుత్వానికి ఈ టీం సహకారం అందించనుంది. కేరళ సర్కార్ కు లేఖ రాశారు కేంద్ర వైద్య,ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్. ఇటీవల సూపర్ స్ప్రెడర్ ఈవెంట్స్ కు అనుమతి ఇచ్చారని లేఖలో పేర్కొన్నారు. కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సిందేనని లేఖలో స్పష్టం చేశారు