ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ సంచలన నిర్ణయం

Khairatabad Festival Committee sensational decision

0
78

ప్రతీ ఏడాది ఖైరతాబాద్ గణేష్ విగ్రహాన్ని హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేస్తారు. నగరంలో పలు ప్రాంతాల్లో ఉన్న గణేష్ విగ్రహాలు ఇక్కడకు తీసుకువచ్చి ప్రత్యేక క్రేన్ల సాయంతో నిమజ్జనం జరుగుతుంది. అయితే తాజాగా ఖైరతాబాద్ గణేష్ విగ్రహాన్ని మండపంలోనే నిమజ్జనం చేయాలని కమిటీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక వచ్చే ఏడాది నుంచి ఈ విధానాన్ని అమలు చేయాలని కమిటీ నిర్ణయం తీసుకుంది.

అంతేకాదు ఇక్కడ వచ్చే ఏడాది గణేషుడి విగ్రహాన్ని మట్టితో తయారు చేయాలని కూడా ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ నిర్ణయం వెల్లడించింది. వచ్చే ఏడాది 70 అడుగుల మట్టి గణపతిని తయారు చేయాలని విగ్రహాన్ని అదే స్థానంలో నీటితో పిచికారీ చేస్తూ నిమజ్జనం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక POP కి స్వస్తి పలకాలని కమిటీ నిర్ణయించింది.

ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్తో తయారు చేసిన వినాయక విగ్రహాలను హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేయొద్దంటూ హైకోర్టు ధర్మాసనం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇక వచ్చే ఏడాది కొంచెం ముందుగానే మట్టితో గణనాధుడి విగ్రహం కొలువుతీర్చనున్నారు.