కిడ్నీ జబ్బులు వీరికే ఎక్కువ వస్తున్నాయి ? మీరు జాగ్రత్త ?మూడు అలవాట్లు వద్దు

కిడ్నీ జబ్బులు వీరికే ఎక్కువ వస్తున్నాయి ? మీరు జాగ్రత్త ?మూడు అలవాట్లు వద్దు

0
109
3d render of Human kidney with DNA

ఈరోజుల్లో చాలా మందికి కిడ్ని సమస్యలు వేధిస్తున్నాయి అంతేకాదు వీటితో పాటు షుగర్, హైబీపీ, అధిక బరువు మనిషిని భయపెడుతున్నాయి. ఇవే మరీ ముఖ్యంగా కిడ్నీకి కీడు చేస్తున్నాయి. సరైన తిండి తినకపోవడం వ్యాయామం చేయకపోవడం, అధిక తిండి ఇలా అనేక కారణాలు వీటికి ముఖ్యమైనవి అనే చెప్పాలి.

ఈ వ్యాధిగ్రస్తులు ఆరోగ్యాన్ని ఏమాత్రమూ అశ్రద్ధ చేసినా.. ఈ రోగాల పట్ల అప్రమత్తత లేకపోయినా.. అవి సైలెంట్గా కిడ్నీలపైనే దాడి చేస్తున్నాయి, అందుకే కిడ్నీ వ్యాధి వచ్చేవారిని చూస్తే కచ్చితంగా ఈ మూడిటితో బాధపడే వారుఉన్నారు.. కచ్చితంగా యువత ఇప్పటి నుంచే కిడ్నీల పనితీరును ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలని సూచిస్తున్నారు.

ప్రస్తుతం కిడ్నీ జబ్బులతో బాధపడుతున్న వారిలో 40 ఏళ్ల లోపు యువతరమే ఎక్కువగా ఉంటోంది. అధిక బరువు ఉన్న వారిలో 20 శాతం మందికి కిడ్నీ సమస్యలు ఉంటున్నాయి. అందుకే మంచి ప్రొటీన్ ఫుడ్ తినాలి ఇష్టం వచ్చిన జంక్ ఫుడ్ తిని అనారోగ్యం పాలవ్వకండి. అధిక బరువు లేకుండా చూసుకోండి.

కచ్చితంగా శరీరంలో రక్త ప్రసరణ, కిడ్నీ ఫంక్షన్ స్థాయి తెలుసుకుని దానికి అనుగుణంగా మందులు వాడాలని, జన్యుపరమైన చరిత్ర ఉన్న వారు కూడా తరచూ వైద్య పరీక్షలు చేయించుకుని కిడ్నీలను కాపాడుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. రక్తపోటు 130-80 ఉండాలి, కొలెస్ట్రాల్ పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి, అధిక బరువు పెరగకుండా చూసుకోండి.