జామపండు ఎన్నో రకాల పోషకాలున్నాయి. అందుకే వీటిని తినడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తారు. అయితే ఇవి రుచితో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తాయి. ఇది శారీరక, మానసిక ఆరోగ్యాలకు మంచిదని డాక్టర్లు అంటుంటారు. మరి జామపండు వల్ల కలిగే లాభాలేంటి? దానిలోని గుణాలు ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతాయో ఇప్పుడు చూద్దాం..
నెలసరిలో వచ్చే నొప్పి, ఇబ్బందులకు జామ దివ్యౌషధంలా పనిచేస్తుంది.
ఇందులోని బి-3, బి-6 రక్తాన్ని సాఫీగా సరఫరా చేయడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది. మానసిక ఒత్తిడి తగ్గుతుంది.
ఇవి తినడం వల్ల గర్భిణులకు అవసరమైన ఫోలిక్ యాసిడ్ అందుతుంది. ముఖ్యంగా న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్ (ఎన్టిడి) సమస్య ఉన్న స్త్రీలలో గర్భస్రావం, శిశు మరణాల్లాంటివి సాధారణం. జామకాయలు ఆ సమస్యను చాలా వరకూ నివారిస్తాయని అధ్యయనాల్లో తేలింది.
మధుమేహం ఉన్నవారు చాలా పండ్లు తినకూడదు. కానీ జామ మినహాయింపు. పైగా రక్తంలో షుగర్ స్థాయిని తగ్గిస్తుంది. హృద్రోగాలను అరికడుతుంది.
బరువు తగ్గాలనుకునే అమ్మాయిలు ఈ పండ్లు రోజుకొకటి తింటే చాలు సత్వర ఫలితం ఉంటుంది.
పీచు పుష్కలంగా ఉంటుంది కనుక జీర్ణప్రక్రియకు దోహదం చేస్తుంది. మరీ పండిపోకుండా దోరగా ఉన్న వాటిని తినడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.