పాలల్లో రారాజు..ఆరోగ్య ప్రదాతలు ఇవే..!

0
96

పాలు అనగానే మనకు ఆవు, గేదె పాలే గుర్తుకువస్తాయి. ఈ మిల్క్​లాగే పోషక విలువలు సమృద్ధిగా ఉన్న ఇతర పాలు కూడా ఉన్నాయి. ఆవు, గేదె పాలల్లో ప్రోటీన్లు, విటమిన్లు అధికంగా ఉంటాయి. కొబ్బరి పాలు, బాదం పాలు, సోయా పాలు, ఓట్ మిల్క్​లోనూ ప్రోటీన్లు అధికమే. కానీ ఇవి ఆరోగ్యానికి మంచివేనా? వాటి పనితీరు ఎలా ఉంటుందో ఓసారి తెలుసుకుందాం.

పచ్చి కొబ్బరి ఎంతో ఆరోగ్యకరం. వంటలకు కొబ్బరిని అదనంగా చేర్చితే వచ్చే రుచే వేరు. పచ్చి కొబ్బరి నుండి తీసే కొబ్బరి పాలు తియ్యగా ఉంటాయి. ఆరోగ్యానికి శ్రేష్ఠమైన ఈ పాలల్లో కేలరీలు ఎక్కువ. ఫైబర్ అధికంగా ఉండటం వలన కొబ్బరి పాలకు బరువును తగ్గించే గుణముంది. కొబ్బరి పాలల్లో రోగనిరోధకశక్తి కూడా ఎక్కువగా ఉంటుంది.

మార్కెట్లో దొరికే శాకాహారం బాదం పాలు. చల్లగా ఉండే పానీయాలు కోరుకునే వారికి ఒక గొప్ప వరం బాదం పాలే. ఒక కప్పు బాదం గింజల్లో కేలరీలు పుష్కలంగా ఉంటాయి. మినరల్స్, ఐరన్, మాంగనీస్​తో పాటు ‘బి’ విటమిన్ అధికంగా ఉంటుంది. వ్యాధి నిరోధకశక్తిని పెంచుతుంది. కంటికి మేలు చేసే ‘ఏ’ విటమిన్ కూడా ఈ పాలల్లో ఎక్కువే. దీనిలో ఉండే విటమిన్-ఇ వల్ల చర్మ సౌందర్యం మెరుగుపడుతుంది.

సోయా మొక్కల నుంచి సేకరించిన అత్యుత్తమ పాల ఉత్పత్తులు సోయా పాలు. సోయా పాలు తక్షణ శక్తినిస్తుంది. దీనిలో కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది. దీనిలో లాక్టోజ్ తక్కువగా ఉంటున్నందున సులభంగా జీర్ణమవుతాయి.

సాధారణంగా బరువు తగ్గటానికి ఓట్స్ తీసుకుంటాం. అలాగే ఓట్స్ పాలు కూడా శరీర బరువును పెంచవు. విటమిన్లతో పాటు దీనిలో ఉండే కాల్షియం ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఫైబర్ అధికంగా ఉంటుంది. ఆవు పాలకంటే ఓట్స్ మిల్క్​లో పది శాతం ‘ఎ’ విటమిన్ ఎక్కువగా ఉంటుంది. ఉదయం అల్పాహారంలో ఓట్స్ మిల్క్​ను తీసుకోవచ్చు.