వ్యాధులను నయం చేసే కిస్‏మిస్..రోజుకు ఎన్ని తినాలంటే?

0
125

కిస్‌మిస్‌ అంటే ఇష్టపడని వాళ్లు ఎవరుంటారు చెప్పండి. కిస్‌మిస్‌ తీయగా ఉండడం వల్ల దీనిని తినడానికి చిన్న, పెద్ద అని తేడా లేకుండా అందరు ఇష్టపడతారు. తీయతీయటి ఎండుద్రాక్ష రుచిలోనే కాదు, లాభాలు చేకూర్చడంలో కూడా మనకు ఉపయోగపడుతుంది. అందుకే రోజుకు ఎన్ని  కిస్‌మిస్‌లు తింటే, ఎలా తింటే ఆరోగ్యానికి మేలు చేకూరుతుందో ఇప్పుడు చూద్దాం..

కిస్‌మిస్‌లో పీచు అధికంగా ఉంటుంది. అంతేకాకుండా కిస్‌మిస్‌లు తినడం వల్ల క్యాల్షియం, ఐరన్‌, మెగ్నీషియం, పొటాషియం, సి-విటమిన్‌లు సమృద్ధిగా లభిస్తాయి. కిస్‌మిస్‌లో ఉన్న విటమిన్‌, ఎ-కెరొటెనాయిడ్‌, బీటా కెరొటెన్‌లు కంటిచూపును మెరుగుపరుస్తుంది. ఇందులోని క్యాల్షియం ఎముకలు, దంతాలు దృఢంగా ఉంచడంలో సహాయపడుతుంది.

రోజుకు ఆరు నుంచి పది వరకు తింటే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. కిస్‌మిస్‌లు సాధారణంగా కంటే నానబెట్టుకుని తినడం వల్ల అద్భుతమైన ఆరోగ్యప్రయోజనాలు చేకూరుతాయని నిపుణులు సూచిస్తున్నారు. ఉదరం, జీర్ణ సంబంధ సమస్యలు తగ్గించడంలో కిస్‌మిస్‌ ఔషధంలా పనిచేస్తుంది. సంతానోత్పత్తి సమస్యలను నివారించడంలో కూడా  కిస్‌మిస్‌ సహాయపడుతుంది.