కివీ ఫ్రూట్ తింటున్నారా ఇది తెలుసుకోండి

కివీ ఫ్రూట్ తింటున్నారా ఇది తెలుసుకోండి

0
114

కివీ ఫ్రూట్ ఆరోగ్యానికి చాలా మంచిది, ఇది నోరూరించే ఫ్రూట్, అయితే ఈమధ్య చాలా ప్రాంతాల్లో వీటిని అమ్ముతున్నారు, గతంలో స్టోర్స్ మార్కెట్లో మాత్రమే దొరికేవి, అయితే ఇమ్యునిటీ పవర్ పెరగాలి అంటే ఈ ఫ్రూట్ చాలా మంచిది.

కివీలో విటమిన్-సి సమృద్ధిగా లభిస్తుంది. ఎ, ఇ విటమిన్లూ లభిస్తాయి. పొటాషియం, క్యాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్ వంటి మినరల్స్తో పాటు డైటరీ ఫైబర్ కూడా ఇందులో ఉన్నాయి. జీర్ణక్రియకు ఇది చాలా బాగుంటుంది. ఇది వారానికి రెండు సార్లు తీసుకున్నా మంచిది.మలబద్దకం సమస్యను తగ్గిస్తుంది.

జలుబు, ఫ్లూను తగ్గిస్తుంది. మొత్తంగా రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. మధుమేహం ఉన్నవారు కూడా కివీని తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇక నిద్ర సమస్య తలనొప్పి ఉన్నా తగ్గుతుంది. ఇక జలుబు దగ్గు కూడా తగ్గుతుంది.