చాలా మంది కుక్కలని పెంచుకుంటారు వాటిపై ఎంతో ప్రేమ ఆప్యాయత చూపిస్తారు, అవి కూడా మనపై అంతే ప్రేమ చూపిస్తాయి, మరీ ముఖ్యంగా కుక్కలకు మనుషులు అంటే చాలా ఇష్టం, అవి కొంచెం ఆహారం పెట్టినా విశ్వాసంగా మన దగ్గర ఉంటాయి… అయితే ఇంట్లో పెంచుకునే అనేక రకాల కుక్కలు మనం చూసే ఉంటాము, అయితే ఇవి కరవడం చాలా అరుదు. కాని ఊరిపై ఉండే కుక్కలు మాత్రం చాలా మందిని కరుస్తూ ఉంటాయి.
వీధికుక్కలు ఎప్పుడు దాడి చేసి.. పిక్కలు పీకేస్తాయో తెలియదు, ఇటీవల పిల్లలపై కూడా ఇలా దాడిచేస్తున్నాయి, ఇలానడిచి వచ్చే సమయంలో కుక్కలు దాడి చేయడం అనేక ఘటనల్లో మనం చూస్తున్నాం, అయితే కుక్క కరిస్తే చాలా మంది ఆందోళన చెందుతారు ఏం చేయాలా అని బెంబెలెత్తిపోతారు, ఒక వేళ మీ కళ్ల ముందు ఎవరిని అయినా కుక్క కరిచినా ఏం చేయాలి అనేది చూద్దాం.
కుక్క కాటుకు గురైతే బొడ్డు చుట్టూ 14 ఇంజెక్షన్లు వేయించుకుంటారు అని చెబుతారు. మరి వైద్యులు ఏం చెబుతున్నారు అంటే.
గుర్తు ఉంచుకోండి కుక్క కాటుకు గురైతే గాయానికి ఎలాంటి కట్టుకట్టకూడదు . ప్రథమ చికిత్స లో భాగంగా గాయమైన ప్రాంతాన్ని పైనుంచి పడే నీటి ప్రవాహం కింద శుభ్రం చేయాలి, అంటే పైప్ కింద లేదా జగ్గుతో నీరు పోసి శుభ్రం చేయాలి, పసర్లు పూతలు ఇలాంటి రాయద్దు, వెంటనే ఆస్పత్రికి తీసుకువెళ్లండి, యాంటీ రేబిస్ ఇంజెక్షన్లు తీసుకోవాలి. ఇలా వ్యాక్సిన్ తీసుకుంటే మీకు రేబిస్ వ్యాధి రాదు, మూడు లేదా ఐదుసార్లు ఇంజెక్షన్ చేస్తారు అని వైద్యులు చెబుతున్నారు , కొన్ని రోజులు హెల్దీ డైట్ ఫాలో అవ్వాలి.
|
|
కుక్క కరిస్తే ముందు వెంటనే ఇలా చేయండి తప్పక తెలుసుకోండి
-