అరటి పండు చాలా తక్కువ రేటుకే మనకు దొరుకుతుంది. ఇంత తక్కువగా దొరుకుతూ అనేక పోషకాలు అందించే పండు అంటే అరటిపండు అనే చెప్పాలి. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ఈ అరటి పండు తినవచ్చు. బరువు పెరుగుతారు, మలబద్దకం తగ్గుతుంది ఆకలి వేయదు, కడుపు నిండుతుంది, ఎనర్జీ వస్తుంది, నీరసనం తగ్గుతుంది. ఇలా అరటి చేసే మేలు శరీరానికి ఎంత చెప్పినా తక్కువే.
కొందరు వ్యాపారులు ఈ మధ్య ఈ అరటి పండు ముగ్గడానికి కెమికల్స్ వాడుతున్నారు. ఇలా వ్యాపారులు అరటిపండ్లను త్వరగా పండించడానికి అనేక షార్ట్ కట్లని వాడుతున్నారు. ఎక్కువమంది కార్బైడ్ అనే కెమికల్ని వాడి కృత్రిమంగా పండిస్తున్నారు.
( అందరూ కాదు కొందరు మాత్రమే). మరి ఈ అరటి పండు ఎలా ముగ్గింది అనేది తెలుసుకోవాలి. మరి ఇది ఎలా గుర్తించాలి అనేది చూద్దాం.
సహజంగా పండిన అరటిపండ్లు లేత గోధుమరంగు, నల్ల మచ్చలను కలిగి ఉంటాయి. చాలా తీయగా ఉంటాయి.
కార్బైడ్ లేదా రసాయనాలు వేసి మాగబెట్టిన పండ్లు లేత పసుపు రంగులో ఉంటాయి. అంత రుచి ఉండవు.
కార్బైడ్ పండ్లు ఎక్కువ రోజులు నిల్వ ఉండవు.
సహజంగా మగ్గిన పండ్లు వారం పైనే ఉంటాయి.