కొత్తబట్టలు వేసుకుంటున్నారా ముందు ఇది తెలుసుకోండి

Know this before wearing new clothes

0
105

కొత్తబట్టలు వేసుకోవాలి అని చాలా మందికి స‌ర‌దా ఉంటుంది. పండుగ‌లు అలాగే పుట్టిన రోజు ,పెళ్లిరోజు ఇలా వేడుక‌ల‌కు క‌చ్చితంగా కొత్త బ‌ట్ట‌లు వేసుకుంటాం. దానికి ప‌సుపు బొట్టు అద్ది ధ‌రిస్తాం. అయితే కొత్త బ‌ట్ట‌లు వేసుకునే వారు కొన్ని జాగ్ర‌త్త‌లు పాటించాలి అంటున్నారు. ఎందుకు అంటే కొత్త బ‌ట్ట‌లు క‌చ్చితంగా ఉతికి వేసుకోవాలి అని చెబుతున్నారు.

కాని వంద‌లో 90 శాతం మంది నేరుగా షాప్ నుంచి కొనుక్కు వ‌చ్చి వాటిని ధ‌రించేస్తారు.
ఇలా ఎందుకు వాష్ చేయాలి అంటే అనేక రకాల రసాయనాలను బట్టలకు రంగులు వేయడంలో కూడా ఉపయోగిస్తారు. అందుకే కొంద‌రికి అలెర్జీ స‌మ‌స్య‌లు రింగ్‌వార్మ్, గజ్జి, దురద వంటి ఇన్ఫెక్షన్లు వస్తాయి.

షాపుల్లో కూడా బట్టలు ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. అటువంటప్పుడు బట్టలలో ఫంగస్ కూడా ఉండవచ్చు. చాలా మంది ఆ బ‌ట్ట‌లు చూస్తూ ఉంటారు ఇలా ప‌లు సూక్ష్మ క్రిములు దానిపై ఉండ‌వ‌చ్చు. ఇక ఐదు సంవ‌త్స‌రాల పిల్లల కు ధ‌రించే ప్ర‌తీ బ‌ట్ట క‌చ్చితంగా ఉతికి వేయాల్సిందే. ఇక చాలా మంది బ‌ట్ట‌లు ట్ర‌య‌ల్స్ వేస్తారు దీని వ‌ల్ల ఆ చెమ‌ట కూడా అక్క‌డ ఉంటుంది అది కూడా ఇన్పెక్ష‌న్లు క‌లిగిస్తుంది.