డార్క్ చాక్లెట్ తింటున్నారా అయితే ఇది తెలుసుకోండి

Know this while eating dark chocolate

0
67

మ‌న‌లో చాలా మంది చాక్లెట్ ల‌వ‌ర్స్ ఉంటారు. ఇక డార్క్ చాక్లెట్ అంటే మ‌రీ ఇష్టం ఉంటుంది. రోజూ ఇంతో అంతో ఎంతో కొంత ఈ డార్క్ చాక్లెట్ తిన‌నిదే వారికి నిద్ర‌ప‌ట్ట‌దు. అయితే ఏదైనా అతిగా తింటే మంచిది కాదు మితంగానే తీసుకోవాలి అనేది వైద్యుల మాట‌. పిల్ల‌ల నుంచి పెద్ద‌ల వ‌ర‌కూ అంద‌రికి ఇష్ట‌మైన ఈ డార్క్ చాక్లెట్ వ‌ల్ల మ‌న‌కు ఏం లాభాలు అనేది చూద్దాం.

డార్క్ చాక్లెట్‌లో అధికంగా ఉండే మెగ్నీషియం రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాదు బీపీని కూడా త‌గ్గిస్తుంది. ఇందులో ఉండే ఐరన్, రక్తంలో ఐరన్ లోపించకుండా కాపాడుతుంది. అయితే డార్క్ చాక్లెట్ తింటే ఎక్కువ లావు అవుతాం అని కొంద‌రు భావిస్తారు. అయితే ఇది పూర్తిగా నిరూపితం కాలేదు అంటున్నారు వైద్యులు.

డార్క్ చాక్లెట్ తింటే శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ఎల్‌డిఎల్‌ను తగ్గిస్తుంది. మ‌నిషికి బాగా యాక్టీవ్ నెస్, ఫ్రెష్ నెస్ పెరుగుతుంది. హార్ట్ స్ట్రోక్ ప్రమాదం కూడా త‌గ్గుతుంద‌ట‌. షుగ‌ర్ పేషెంట్లు కూడా అప్పుడ‌ప్పుడూ ఈ డార్క్ చాక్లెట్ తీసుకోవ‌చ్చు అయితే అది కూడా మితంగా.

గ‌మ‌నిక – ఏది అతిగా తీసుకున్నా వ‌చ్చే ప్ర‌యోజ‌నాల కంటే ప్ర‌తికూల ఫ‌లితాలు ఎక్కువ ఉంటాయి. అందుకే మితంగానే తీసుకోవాలి అని చెబుతున్నారు నిపుణులు.