మనం ఏదైనా ఫుడ్ ఐటెమ్స్ చేసుకునే సమయంలో ఎక్కువగా పాలపొడి వాడుతూ ఉంటాం, అంతేకాదు పాలు లేని సమయంలో ఇలా పాలపొడి ప్యాకెట్ల నుంచి వాటర్ లో కలిపి పాలు చేసుకుంటారు కొందరు, ఈ మధ్య రకరకాల ఫుడ్ ఐటెమ్స్ కి ఈ పాలపొడి విరివిగా వాడుతున్నారు.
మరి ఈ పాలపొడి ఎలా తయారు చేస్తారు అనేది చూద్దాం…సెంట్రిఫ్యూజ్ అనే పద్ధతిలో పాలలోని ప్రొటీన్ను, కొవ్వును, నీటిని వేరు చేస్తారు. కొవ్వును ఐస్క్రీం కంపెనీలకు అమ్మి, మిగిలిన దాంట్లో పాలపొడిని కలిపి దానిని పాశ్చురైజేషన్ చేస్తారు. అంటే ఎక్కువ వేడి, వెంటనే బాగా చల్లదనాన్ని ఇవ్వడం ద్వారా అందులోని, సూక్ష్మజీవులను చంపేయడమనే ఈ ప్రక్రియ.
సో ఇది చాలా సమయం తీసుకునే ప్రక్రియ, అందుకే దీని ధర కూడా కాస్త ఎక్కువ ఉంటుంది, అంతేకాదు
పాలపొడి కోసం ఎక్కువ వత్తిడితో ఒక చిన్న రంధ్రం లోంచి పాలను గాలిలోకి స్ప్రే చేయడం ద్వారా పాలపొడి తయారవుతుంది. అయితే ఈ క్రమంలో అందులో ఉన్న కొవ్వు గాలిలోని నైట్రేట్స్ను కలుపుకుని ఆక్సిడైజ్ అవుతుంది. అయితే పాలపొడి శరీరానికి డేంజర్ ఇది ఎక్కువగా వాడకూడదు.. మితంగా తీసుకోవాలి, చిన్నపిల్లలకు ఇది ఇవ్వడం చాలా డేంజర్ అని చెబుతున్నారు నిపుణులు.