కొత్తిమీర వాసన రుచిలో అమోఘం అనే చెప్పాలి, అది కూరల్లో వేస్తే దాని రుచి వేరు, పచ్చడి చేస్తే అద్బుతం అంటారు, అందుకే ప్రతీ వంటలోనూ కొత్తమీర వాడుతూ ఉంటారు..ఇక దీనిలో కూడా చాలా పోషకాలు ఉన్నాయి,మరి ఈ కొత్తిమీర వల్ల ఉపయోగాలు చూద్దాం.
కొత్తిమీర మనం కూర చేసేటప్పుడు ఆ కూరలో ముందు వేయకూడదు, కూరపూర్తి అయిన తర్వాత దానిపై చల్లాలి …ఇలా చేస్తే పోషకాలు అందుతాయి, ఉడికే సమయంలో వేస్తే ఆ వేడికి ఆవిరిరూపంలో పోషకాలు పోతాయి గుర్తు ఉంచుకోండి.
కొత్తిమీద ధనియాల ద్వారా వస్తుంది, మట్టిలో నీటి చుక్కలు ధనియాలు వేస్తే సులువుగా కొత్తిమీర వస్తుంది. ఇక ధనియాలు కొత్తిమీర బీపీని తగ్గిస్తాయి, అంతేకాదు షుగర్ లెవల్ సమానంగా ఉంచుతాయి.
కడుపులో మంటల వంటివి తగ్గాలంటే కొత్తిమీర వాడాలి. కాన్సర్ బారిన పడకుండా ఉంటాలంటే కొత్తిమీర వాడాలి. గుండె సంబంధిత జబ్బులు రాకుండా కొత్తిమీర కాపాడుతుంది.
ఇక బాగా లావు ఉన్న వారు కూడా కొలెస్ట్రాల్ తగ్గాలి అంటే ఇది వాడండి. ఇక కొత్తిమీర మెదడుకి బాగా పని చేస్తుంది. కొత్తిమీర జీర్ణవ్యవస్థను కాపాడుతుంది. పేగుల్ని శుభ్రంగా ఉంచుతుంది.ఇక కడుపు ఉబ్బరం మలబద్దకం సమస్య ఉంటే దూరం అవుతుంది.